మెనోపాజ్‌ బాధలకు ‘సహజ’ పరిష్కారం!

మహిళలు నెలసరి నిలిచిపోయే దశకు (మెనోపాజ్‌) చేరుకుంటున్నకొద్దీ ఈస్ట్రోజెన్‌ స్థాయులు తగ్గుతూ వస్తుంటాయి. దీంతో నిద్ర సరిగా పట్టకపోవటం, ఆందోళన, కుంగుబాటు, జననాంగాలు పొడిబారటం, ఎముకల నొప్పులు,

Published : 02 Apr 2019 00:23 IST

హిళలు నెలసరి నిలిచిపోయే దశకు (మెనోపాజ్‌) చేరుకుంటున్నకొద్దీ ఈస్ట్రోజెన్‌ స్థాయులు తగ్గుతూ వస్తుంటాయి. దీంతో నిద్ర సరిగా పట్టకపోవటం, ఆందోళన, కుంగుబాటు, జననాంగాలు పొడిబారటం, ఎముకల నొప్పులు, ఒళ్లంతా వేడి ఆవిర్లు రావటం, రాత్రిపూట ఉక్కపోయటం, నెమ్మదిగా బరువు పెరగటం వంటి సమస్యలు మొదలవుతుంటాయి. కొందరికి చిరాకు, స్పష్టంగా ఆలోచించలేకపోవటం వంటి ఇబ్బందులూ తలెత్తొచ్చు. కొందరు వేడి ఆవిర్లు, ఉక్కపోతతో చాలా తీవ్రంగా సతమతమవుతూ ఉంటారు కూడా. ఇలాంటివాళ్లు పడకగది చల్లగా ఉంచుకోవటం, తేలికైన కాటన్‌ దుస్తులు ధరించటం మంచిది. అలాగే మసాలా పదార్థాలు.. కెఫీన్‌తో కూడిన కాఫీలు, చాక్లెట్లు మానెయ్యాలి. పొగ, మద్యం అలవాటుంటే వాటికి దూరంగా ఉండటం మేలు. క్రమం తప్పకుండా వ్యాయామం, యోగా చేయటం ఉత్తమం. ఇవి మానసిక చిరాకు వంటివి తగ్గటానికి, మానసిక ప్రశాంతత చేకూరటానికి తోడ్పడతాయి. సోయా పదార్థాల్లోని ఐసోఫ్లేవనాయిడ్లు హార్మోన్‌ స్థాయులు నియంత్రణలో ఉండటానికి తోడ్పడతాయి. ఇవి కొంతవరకు ఈస్ట్రోజెన్‌ మాదిరిగా పనిచేస్తాయి. అవిసె గింజల్లోని లిగ్నిన్లు కూడా హార్మోన్‌ జీవక్రియలను ప్రభావితం చేస్తాయి. అలాగే కాబూలీ శనగలు, పాలకూర, బాదం పప్పు వంటివీ మెనోపాజ్‌ లక్షణాలు తగ్గుముఖం పట్టటానికి దోహదం చేస్తాయి. వీటికి తోడుగా యాంటీఆక్సిడెంట్లతో కూడిన తాజా పండ్లు, కూరగాయలు తీసుకుంటే మరింత మెరుగైన ఫలితం కనబడుతుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు