నిరోధకశక్తికీ మత్తు!

కొవిడ్‌-19 వంటి ఇన్‌ఫెక్షన్ల బారినపడకూడదని కోరుకుంటున్నారా? అయితే మద్యం జోలికి వెళ్లకండి....

Published : 26 May 2020 00:30 IST

కొవిడ్‌-19 వంటి ఇన్‌ఫెక్షన్ల బారినపడకూడదని కోరుకుంటున్నారా? అయితే మద్యం జోలికి వెళ్లకండి. దీంతో రోగనిరోధకశక్తి మందగించి సాంక్రమిక, సాంక్రమికేతర జబ్బుల ముప్పు పెరుగుతుంది మరి. మద్యం శరీరంలోని అన్ని అవయవాలు, కణాల మీద దుష్ప్రభావం చూపుతుంది. దీనికి రోగనిరోధక వ్యవస్థ కణాలూ మినహాయింపేమీ కాదు. ఉదాహరణకు- ఊపిరితిత్తుల్లోకి హానికారక క్రిములు ప్రవేశించకుండా అడ్డుకునే రోగనిరోధక కణాలు, సూక్ష్మకేశాలను మద్యం దెబ్బతీస్తుంది. ఇది కరోనా వైరస్‌ వంటి క్రిములు తేలికగా లోపలికి ప్రవేశించటానికి వీలు కల్పిస్తుంది. అంతేనా? మద్యంతో ఊపిరితిత్తుల కణజాలం, పేగుల్లోని సున్నితమైన పొర సైతం దెబ్బతింటుంది. ఇవన్నీ ఇన్‌ఫెక్షన్ల ముప్పును, తీవ్రతను పెంచేవే.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని