పెరుగుతో ఊపిరితిత్తుల క్యాన్సర్‌ దూరం!

ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు ప్రధాన కారకం పొగ తాగటం. అలాగని పొగ తాగనివారికి రాకూడదనేమీ లేదు. ఊపిరితిత్తుల క్యాన్సర్‌ బారినపడుతున్నవారిలో సుమారు 20% మంది సిగరెట్ల జోలికి వెళ్లనివారే. మరి దీని ముప్పును తగ్గించుకునేదెలా అని ఆలోచిస్తున్నారా?

Updated : 13 Sep 2022 09:58 IST

ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు ప్రధాన కారకం పొగ తాగటం. అలాగని పొగ తాగనివారికి రాకూడదనేమీ లేదు. ఊపిరితిత్తుల క్యాన్సర్‌ బారినపడుతున్నవారిలో సుమారు 20% మంది సిగరెట్ల జోలికి వెళ్లనివారే. మరి దీని ముప్పును తగ్గించుకునేదెలా అని ఆలోచిస్తున్నారా? రోజూ పెరుగు, అలాగే ఆహారంలో పీచు పదార్థాలు ఉండేలా చూసుకోండి. రోజుకు సుమారు 85 గ్రాముల పెరుగు తినే మగవారికి, 113 గ్రాముల పెరుగు తినే ఆడవారికి ఊపిరితిత్తుల క్యాన్సర్‌ ముప్పు 19% వరకు తక్కువగా ఉంటున్నట్టు జామా పత్రికలో ప్రచురితమైన అధ్యయనం సూచిస్తోంది. అలాగే పీచు లభించే పదార్థాలు ఎక్కువగా తీసుకున్నవారికి ఊపిరితిత్తుల క్యాన్సర్‌ వచ్చే అవకాశం 17% తక్కువగా ఉంట్టున్నట్ట బయటపడింది. మొత్తం 14 లక్షల మందిపై నిర్వహించిన 10 అధ్యయనాల ఫలితాలను విశ్లేషించి దీన్ని గుర్తించారు. కొద్దిమొత్తంలో పెరుగు, పీచును తీసుకున్నా క్యాన్సర్‌ ముప్పు తగ్గుతుంటం విశేషం. క్రమం తప్పకుండా ఈ రెండింటినీ తీసుకుంటే మరింత ఎక్కువగా.. అంటే 33% ముప్పు తగ్గుతోంది కూడా. అంటే చిన్న చిన్న మార్పులతోనే పెను ప్రమాదాన్ని నివారించుకునే వీలుంటోందన్నమాట.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని