logo

విజయకాంత్‌ కోలుకోవాలని పూజలు

డీఎండీకే వ్యవస్థాపక అద్యక్షుడు విజయకాంత్‌ త్వరగా కోలుకోవాలంటూ నీలక్కోట్టైలోని నటరాజర్‌ పెరుమాల్‌ ఆలయంలో ఆ పార్టీ దిండిగల్లు జిల్లా కార్యదర్శి జవహర్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Updated : 05 Jul 2022 06:35 IST


నటరాజర్‌ పెరుమాల్‌ ఆలయంలో ప్రత్యేక పూజ నిర్వహిస్తున్న దృశ్యం

విల్లివాక్కం, న్యూస్‌టుడే: డీఎండీకే వ్యవస్థాపక అద్యక్షుడు విజయకాంత్‌ త్వరగా కోలుకోవాలంటూ నీలక్కోట్టైలోని నటరాజర్‌ పెరుమాల్‌ ఆలయంలో ఆ పార్టీ దిండిగల్లు జిల్లా కార్యదర్శి జవహర్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నీలక్కోట్టై యూనియన్‌ కార్యదర్శులు పళని, వెళ్లైస్వామి, వత్తలగుండు యూనియన్‌ కార్యదర్శులు కరుత్తప్పాండి, మణిమురుగన్‌, జిల్లా డిప్యూటీ కార్యదర్శులు మాసానం, విద్యా మురుగేంద్రన్‌, నీలక్కోట్టై యూనియన్‌ కోశాధికారి శివా, యూనియన్‌ ప్రిసీడియం చైర్మన్‌ మణిగండన్‌, నీలక్కోట్టై నగర కార్యదర్శి మురుగన్‌, పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని