Corona: కరోనాకు ఉప్పు కళ్లెం!

గొంతునొప్పి తగ్గటానికి ఉప్పునీటిని పుక్కిట పట్టటం తెలిసిందే. కొవిడ్‌-19 మొదలయ్యాక ఇదింకాస్త ఎక్కువైంది కూడా. కాకతాళీయమో ఏమో గానీ ఉప్పునీరు కొవిడ్‌ కారక సార్స్‌-కొవీ-2....

Updated : 28 Sep 2021 07:10 IST

గొంతునొప్పి తగ్గటానికి ఉప్పునీటిని పుక్కిట పట్టటం తెలిసిందే. కొవిడ్‌-19 మొదలయ్యాక ఇదింకాస్త ఎక్కువైంది కూడా. కాకతాళీయమో ఏమో గానీ ఉప్పునీరు కొవిడ్‌ కారక సార్స్‌-కొవీ-2 వృద్ధిని అడ్డుకుంటున్నట్టూ బ్రెజిల్‌ అధ్యయనం పేర్కొంటోంది. ఇన్‌ఫెక్షన్‌ సోకిన ఊపిరితిత్తుల కణాల్లో ఉప్పు నీటి ప్రభావాన్ని పరీక్షించగా.. వైరస్‌ వృద్ధిని 88% వరకు తగ్గటం విశేషం. వైరస్‌ వృద్ధి తగ్గితే జబ్బు తీవ్రతా తగ్గుతుంది. అందుకే ఉప్పు నీటి చికిత్సపై ప్రయోగ పరీక్షలు నిర్వహించాలని భావిస్తున్నారు. ఇవి విజయవంతమైతే కొవిడ్‌ నివారణకు, చికిత్సల రూపకల్పనకు బాటలు పడ్డట్టే.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని