నవ్వుల్‌.. నవ్వుల్‌.!

సిరి : అన్నయ్యా.. నాకు భయంగా ఉంది..గిరి : ఎందుకు? ఏం జరిగింది?

Published : 05 Oct 2023 00:09 IST

ఓస్‌.. అంతేనా.?

సిరి : అన్నయ్యా.. నాకు భయంగా ఉంది..
గిరి : ఎందుకు? ఏం జరిగింది?
సిరి : ఇప్పుడే నా తలమీది నుంచి కందిరీగల గుంపు రివ్వున వెళ్లింది..

గిరి : ఓస్‌.. అంతేనా.. నిన్న నా తల మీది నుంచి విమానమే వెళ్లింది తెలుసా..?


సింపుల్‌..

అమ్మ : ఏంటి కిట్టూ.. హుషారుగా కనిపిస్తున్నావు?
కిట్టు : అవునమ్మా.. సమస్యల నుంచి ఎలా తప్పించుకోవాలో నాకు తెలిసిపోయింది..

అమ్మ : ఎలా?
కిట్టు : మన సమస్యలను వాట్సాప్‌ స్టేటస్‌లో పెట్టేస్తే సరి.. 24 గంటల్లో మాయమవుతాయి..


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని