నవ్వుల్‌..నవ్వుల్‌...!

అలా చెబుతా..! కిట్టు: బిట్టూ.. ఎక్కడికెళ్తున్నావు? బిట్టు: నిన్న నాకు చిప్స్‌ ప్యాకెట్‌లో వచ్చిన నోట్లు తీసుకొని బ్యాంకుకి వెళ్తున్నా కిట్టూ..!

Published : 10 Nov 2023 00:53 IST

అలా చెబుతా..!
కిట్టు: బిట్టూ.. ఎక్కడికెళ్తున్నావు?
బిట్టు: నిన్న నాకు చిప్స్‌ ప్యాకెట్‌లో వచ్చిన నోట్లు తీసుకొని బ్యాంకుకి వెళ్తున్నా కిట్టూ..!
కిట్టు: అవి చెల్లవు కదా.. బ్యాంకు వాళ్లు ఎలా తీసుకుంటారు?

బిట్టు: వాళ్లను తీసుకోమనేం చెప్పను.. నా అకౌంట్లోనే వేయమంటాను..
కిట్టు: ఆఁ..!


నువ్వే చెప్పావు కదమ్మా..!

అమ్మ: చిన్నీ.. ఎగ్జామ్స్‌ వస్తున్నాయి కదా.. సరిగ్గా చదువుకో..!
చిన్ని: అలాగేనమ్మా..
అమ్మ: అలాగేనంటూ బయటికి వెళ్తావేంటి?

చిన్ని: ఎగ్జామ్స్‌ వస్తున్నాయన్నావు కదమ్మా.. తీసుకొద్దామని..!
అమ్మ: ఆఁ..!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని