కొంచెం తీపి... కొంచెం పులుపు...

కాస్త తియ్యగా.. మరికాస్త పుల్లగా ఉండే కమలాపండు తింటే భలే హాయిగా ఉంటుంది కదూ... రుచితోపాటు దీంట్లో పోషకాలూ

Published : 27 Dec 2020 00:38 IST

పోషకాలం

కాస్త తియ్యగా.. మరికాస్త పుల్లగా ఉండే కమలాపండు తింటే భలే హాయిగా ఉంటుంది కదూ... రుచితోపాటు దీంట్లో పోషకాలూ ఎక్కువే. అవేమిటో తెలుసుకుందామా...
* దీంట్లో సిట్రిక్‌ యాసిడ్‌, విటమిన్‌- బి1, బి6, బి12, విటమిన్‌-సి, బీటాకెరోటిన్‌ ఉంటాయి.
* దీంట్లోని పోషకాలు గొంతు ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షణ కల్పిస్తాయి.  
* దీన్ని తినడం వల్ల కంటిచూపు మెరుగుపడుతుంది.
* దీంట్లోని విటమిన్‌-సి దగ్గూ, జలుబు నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
* కాలేయం, గుండె, మూత్రపిండాల పనితీరును మెరుగుపరుస్తుంది.
* పొట్ట ఉబ్బరంతో బాధపడేవాళ్లు దీని తీసుకోవడం వల్ల ఫలితం ఉంటుంది.
* మూత్ర సమయంలో  మంటగా ఉంటే కమలారసంలో కొబ్బరినీటిని కలిపి తాగితే మంచిదంటారు.
* ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
* దీంట్లోని పీచు పదార్థం మలబద్ధకాన్ని తగ్గిస్తుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని