ఖర్‌ ఉండాల్సిందే!

అసోమీలు ఏ వంట వండాలన్నా కూడా అందులో ఖర్‌ ఉండాల్సిందే. ఇంతకీ ఈ ఖర్‌ ఏంటనేగా మీ సందేహం...

Updated : 15 Jun 2021 12:49 IST

పొరుగు రుచి!

అసోమీలు ఏ వంట వండాలన్నా కూడా అందులో ఖర్‌ ఉండాల్సిందే. ఇంతకీ ఈ ఖర్‌ ఏంటనేగా మీ సందేహం...
అసోమీలు ఏ వంటకాలని చేసినా అందులో ఖర్‌ అనే ప్రత్యేక పదార్థాన్ని కలుపుతారు. మనం ఉల్లిపాయ లేకుండా కూర ఎలా వండమో అలా వీళ్లు ఈ పదార్థం లేకుండా వంట చేయరు. పైగా ఖర్‌ తిననివాడు అసలు అసోమీయే కాదని స్థానిక సామెత. ఇంతకీ ఖర్‌ అంటే ఏంటో తెలుసుకుందాం. స్థానికంగా దొరికే ఒక రకం అరటికాయ తొక్కలని ఈ ఖర్‌ చేసేందుకు వాడతారు. తొక్కలని ఎండబెట్టి.... కాల్చి బూడిదగా చేస్తారు. ఈ బూడిద నుంచి వడకట్టిన స్వచ్ఛమైన నీళ్లనే ఖర్‌ అంటారు. కొన్నిసార్లు అరటికాయతో కాకుండా... బొప్పాయి, కీరదోస తొక్కలతో ఈ నీళ్లని తయారుచేస్తారు. వంటకాలకి క్షార గుణాన్ని తెచ్చేందుకు, చక్కగా జీర్ణం అయ్యేందుకు ఈ నీళ్లను వాడతారట. ముఖ్యంగా చేపలకూర, పప్పూబొప్పాయి వంటి వంటకాలని దీంతో చేస్తారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని