యాంటీ వైరల్‌ ఆహారం తిందామా!

కొవిడ్‌ కొత్త కొత్త రూపాలతో మనుషుల ప్రాణాలతో ఆడుకుంటోంది. ఇలాంటి సమయంలో వ్యాక్సిన్‌తోపాటు మనం తీసుకునే పోషకాహారమే మనల్ని రక్షిస్తుంది. ముఖ్యంగా యాంటీ వైరల్‌ గుణాలున్న కొన్ని రకాల ఆహార పదార్థాలను తప్పనిసరిగా తీసుకోవాలి.

Updated : 15 Jun 2021 12:32 IST

పోషకాలమ్‌

కొవిడ్‌ కొత్త కొత్త రూపాలతో మనుషుల ప్రాణాలతో ఆడుకుంటోంది. ఇలాంటి సమయంలో వ్యాక్సిన్‌తోపాటు మనం తీసుకునే పోషకాహారమే మనల్ని రక్షిస్తుంది. ముఖ్యంగా యాంటీ వైరల్‌ గుణాలున్న కొన్ని రకాల ఆహార పదార్థాలను తప్పనిసరిగా తీసుకోవాలి. అవేంటో చూద్దామా...

వెల్లుల్లి... దీన్ని ఆహారంలో తరచూ తీసుకుంటే సాధారణ ఇబ్బందుల నుంచి, చాలా రకాల వైరల్‌ ఇన్‌ఫెక్షన్ల బారి నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు. దీన్ని ఇన్‌ఫెక్షన్లను తగ్గించడానికి నూనె రూపంలోనూ వాడతారు. కాబట్టి కూర, చారు, సలాడ్‌... ఇలా అన్నింటిలో వేసుకోవడం అలవాటు చేసుకోండి.

అల్లం... వైరల్‌, బ్యాక్టీరియల్‌, ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్లకు కారణమయ్యే విషపదార్థాలు శరీరంలో పేరుకుపోకుండా ఇది అడ్డుకుంటుంది. ఇన్ని సుగుణాలున్న దీన్ని టీ, కషాయం, చట్నీ, కూరల్లో... ఇలా వివిధ రూపాల్లో తీసుకోండి.

పసుపు... దీనిలో ఔషధ గుణాలు బోలెడు. అలాగే శక్తిమంతమైన సమ్మేళనాలు కూడా. పసుపులోని యాంటీవైరల్‌ లక్షణాలు జలుబు, ఫ్లూ లాంటి వాటి నుంచి మిమ్మల్ని త్వరగా బయట పడేస్తాయి.

లెమన్‌ బామ్‌... ఇది హెర్పిస్‌ సింప్లెక్‌ లాంటి వైరస్‌ కారక ఇన్‌ఫెక్షన్లను తగ్గించడంలో ముందుంటుంది. అలాగే జలుబునూ నియంత్రిస్తుంది. ఇది సూపర్‌ మార్కెట్‌లోనూ లభ్యమవుతుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని