పోషకాల పొత్తు!

చల్లటి వాతావరణంలో వేడి వేడి మొక్కజొన్న పొత్తు తింటుంటే ఆహా అనిపిస్తుంది కదూ. పసిడి రంగులో మెరిసిపోతూ ఆరోగ్యాన్నిచ్చే మొక్కజొన్నలోని పోషకాలేంటో తెలుసుకుందామా...

Published : 01 Aug 2021 02:29 IST

ల్లటి వాతావరణంలో వేడి వేడి మొక్కజొన్న పొత్తు తింటుంటే ఆహా అనిపిస్తుంది కదూ. పసిడి రంగులో మెరిసిపోతూ ఆరోగ్యాన్నిచ్చే మొక్కజొన్నలోని పోషకాలేంటో తెలుసుకుందామా...

* మొక్కజొన్నలో విటమిన్లు-ఎ, బి, సి, ఇలు... వీటితోపాటు పోషకాలు, ఖనిజాలు మెండుగా ఉంటాయి. ఈ కండెలోని పీచు ఆహారం అరుగుదలకు తోడ్పడుతుంది. కాబట్టి వీటిని ఆహారంలో చేర్చుకుంటే మలబద్ధకం సమస్య ఉత్పన్నం కాదు.

*  ఈ పొత్తులోని విటమిన్‌-బి12, ఇనుము, ఫోలిక్‌ ఆమ్లం రక్తవృద్ధికి తోడ్పడతాయి.

*  ఇది రక్తంలోని కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. రక్తపోటునూ నియంత్రిస్తుంది.

*  కంకిలోని ఫాస్ఫరస్‌ కిడ్నీల ఆరోగ్యంలో ప్రధాన పాత్ర వహిస్తుంది. అలాగే మెగ్నీషియం ఎముకలకు బలాన్నిస్తుంది. 

*  దీన్ని మధుమేహులూ తినొచ్చు.

*  ఈ గింజల్లోని బీటాకెరొటిన్‌ కంటి ఆరోగ్యానికి మంచిది.

*  ఇది ఫ్రీరాడికల్‌్్సను నిరోధించి చర్మాన్ని మెరిసేలా చేస్తుంది.

*  దీంట్లో మాంసకృత్తులు మెండుగా ఉంటాయి.

*  నాడులు, కండరాల ఆరోగ్యానికి మంచిది.

*  ఈ గింజల్లో మాంగనీస్‌, పొటాషియం, మెగ్నీషియం, జింక్‌, కాపర్‌, ఇనుము ఉంటాయి. 100 గ్రాముల కార్న్‌ నుంచి 96 కిలోకెలొరీల శక్తి అందుతుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని