చక్కని చిక్కుడు

ఈ కాలంలో చిక్కుడు కాయలు విరివిగా దొరుకుతాయి. ఏంటీ.. చిక్కుడు అనగానే ముఖం చిట్లిస్తున్నారు. వీటిలోని పోషకాల గురించి తెలుసుకుంటే తోలు, గింజ అని తేడా లేకుండా  తినేస్తారు!

Published : 02 Jan 2022 01:18 IST

పోషకాలమ్‌

ఈ కాలంలో చిక్కుడు కాయలు విరివిగా దొరుకుతాయి. ఏంటీ.. చిక్కుడు అనగానే ముఖం చిట్లిస్తున్నారు. వీటిలోని పోషకాల గురించి తెలుసుకుంటే తోలు, గింజ అని తేడా లేకుండా  తినేస్తారు!
* వంద గ్రాముల చిక్కుడు కాయల్లో దాదాపు మూడు వంతులకు పైగా నీరే ఉంటుంది. వీటి నుంచి 24 కెలొరీల శక్తి లభిస్తుంది. 4 గ్రా, మాంసకృత్తులు, 2 గ్రా., పిండిపదార్థాలు,  పీచు 9 గ్రా ఉంటాయి. కొవ్వు ఉండదు. క్యాల్షియం 64 మి.గ్రా., ఫోలిక్‌ ఆమ్లం 20-40 మై.గ్రా.,  ఉంటాయి. వీటితోపాటు మెగ్నీషియం, మాంగనీస్‌, యాంటీఆక్సిడెంట్లు పుష్కలం.
* ఈ గింజల్లో అధికంగా ఉండే ఎల్‌- డోపమైన్‌ అనే రసాయనం పార్కిన్‌సన్స్‌ను రాకుండా అడ్డుకుంటుంది. చిక్కుడు కాయలోని కొన్ని రసాయనాలు సంతోష హార్మోన్‌ విడుదలకు తోడ్పడతాయి. కాబట్టి ఒత్తిడిగా, ఆందోళనగా ఉన్నప్పుడు ఈ కూర తిని చూడండి.  
* బాలింతలు, గర్భిణులు, వ్యాయామం చేసేవారికి చక్కటి ఎంపిక.
* కెరొటినాయిడ్‌ సమ్మేళనాలు సమృద్ధిగా ఉండి కాలేయ ఆరోగ్యాన్ని కాపాడతాయి.  
* వీటిలో క్యాల్షియం, విటమిన్‌-డి ఉండటం వల్ల ఎముకలకూ మంచిది.
* ఎండిన చిక్కుడు గింజలను కూరల్లో ఏడాది పొడవునా వాడుకోవచ్చు.
* బరువును నియంత్రణలో ఉంచుతాయి. గుండె ఆరోగ్యానికీ మంచివి.
* దీనిలోని పీచు జీర్ణవ్యవస్థ ఆరోగ్యంతోపాటు పేగు క్యాన్సర్లు రాకుండా చూస్తుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని