హిమక్రీములకో మ్యూజియం!

ఐస్‌క్రీంని చూస్తే పెద్దవాళ్లూ.. చిన్నపిల్లల్లా అయిపోతారు. ఒక ఐస్‌క్రీంకే మనసు పారేసుకునే మనకు... ఇక ఎటుచూసినా రంగురంగుల క్యాండీలు, నోరూరించే పాప్‌సికెల్స్‌ సందడి చేస్తే? సింగపూర్‌లోని ఐస్‌క్రీం మ్యూజియంలో అడుగుపెడితే ఇటువంటి అనుభూతే కలుగుతుంది.

Published : 12 Jun 2022 01:21 IST

ఐస్‌క్రీంని చూస్తే పెద్దవాళ్లూ.. చిన్నపిల్లల్లా అయిపోతారు. ఒక ఐస్‌క్రీంకే మనసు పారేసుకునే మనకు... ఇక ఎటుచూసినా రంగురంగుల క్యాండీలు, నోరూరించే పాప్‌సికెల్స్‌ సందడి చేస్తే? సింగపూర్‌లోని ఐస్‌క్రీం మ్యూజియంలో అడుగుపెడితే ఇటువంటి అనుభూతే కలుగుతుంది. 60వేల చదరపు అడుగుల స్థలంలో తీర్చిదిద్దిన వివిధ రకాల ఐస్‌క్రీం బొమ్మలు మనల్ని అక్కడ నుంచి రాలేనంతగా కట్టిపారేస్తాయి. అందుకే స్ప్రింకెల్‌పూల్‌, డ్రాగన్‌ప్లేగ్రౌండ్‌ వంటి చోట పిల్లలూ, పెద్దలూ కూడా సెల్ఫీలు తీసుకుని మురిసిపోతుంటారు. కేవలం సెల్ఫీలతోనే సరిపెట్టుకోవాల్సిన అవసరం లేదు. అరుదుగా దొరికే ఐస్‌క్రీం రకాలని తక్కువ ధరకే కొనుక్కొని తినొచ్చు. ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ ఇచ్చే అవకాశం కూడా ఉంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని