పులావ్‌కి బిర్యానికి తేడా ఏంటి?

నాకు బిర్యానికి, పులావ్‌కి తేడా తెలియదు. రెండింటికి రుచిలో తేడా ఉంటుందా? పులావ్‌ అంటే నెయ్యితో చేస్తారని విన్నాను నిజమేనా?

Published : 08 Apr 2018 01:40 IST

ప్ర&జ
పులావ్‌కి బిర్యానికి తేడా ఏంటి?

నాకు బిర్యానికి, పులావ్‌కి తేడా తెలియదు. రెండింటికి రుచిలో తేడా ఉంటుందా? పులావ్‌ అంటే నెయ్యితో చేస్తారని విన్నాను నిజమేనా?

- కవిత, వైజాగ్‌

ముందుగా మీకు పులావ్‌ గురించి చెబుతాను. పులావ్‌ తయారీ చాలా తేలిక. ఏ బియ్యంతో అయినా దీన్ని తయారుచేసుకోవచ్చు. ఒన్‌పాట్‌ ఒన్‌షాట్‌ అంటారే ఆ తరహాలో పులావ్‌ని తయారుచేసుకోవచ్చు. కావల్సినంత బియ్యం, కాయగూరలు, వేయాలనుకుంటే మాంసాహారం వేసి కుక్కర్‌ మూతపెట్టి ఉడికించేస్తే అది పులావ్‌. దీనికి పెద్దగా నైపుణ్యాలు అవసరం లేదు. పిలాఫ్‌ అనే పదం నుంచి పులావ్‌ అనే పదం వచ్చింది. ప్రపంచంలో చాలా ప్రాంతాల్లో ఈ పులావ్‌ని తయారు చేసుకుంటారు. కానీ బిర్యాని అలా కాదు. చాలా తక్కువ చోట్ల మాత్రమే బిర్యానీ దొరుకుతుంది. నైపుణ్యంతో చేసే ఖరీదైన వంటకం బిర్యాని. బిర్యానీని ఒకేసారి చేద్దామంటే కుదరదు. అంచలంచెలుగా చేయాల్సిందే. సరైన బిర్యానీలో.. 21 రకాల సుగంధ ద్రవ్యాలు పడాల్సిందే. ఇలాచి, లవంగం, దాల్చిని, జాజికాయ, జాపత్రి మరాటిమొగ్గ, చందనం ఇలా 21 రకాల వేసుకోవచ్చు. ఇన్ని పులావ్‌లో వేయరు. ప్రాథమికంగా వేసే దాల్చిని, లవంగాలు వంటివి మాత్రమే వేస్తారు. బిర్యానీని ప్రత్యేకించి బాస్మతి బియ్యంతోనే తయారుచేయాలి. ఇందులో కూడా రెండు రకాలు ఉంటాయి. పక్కి బిర్యాని, కచ్చీ బిర్యానీ అని. బిర్యానీలో కాయగూరలు వాడినా, మాంసాహారం వాడినా వాటిని తప్పనిసరిగా మారినేషన్‌ చేసే వేయాలి. అది కూడా నెయ్యితోనే వండాలి. పులావ్‌కి నెయ్యి తప్పనిసరి కాదు.

-ప్రణీత్‌, చెఫ్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని