తక్షణ శక్తికి సపోటా

సపోటా పండు చూడగానే నోరూరుతుంది. తియ్యటి గుజ్జు నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది. ఇది రుచికరమే కాదు బోలెడు పోషకాలనూ అందిస్తుంది. అవేంటంటే..

Published : 30 Jan 2022 02:21 IST

పోటా పండు చూడగానే నోరూరుతుంది. తియ్యటి గుజ్జు నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది. ఇది రుచికరమే కాదు బోలెడు పోషకాలనూ అందిస్తుంది. అవేంటంటే..

* ఈ పండులో ఇనుము, పోటాషియం, కాపర్‌, క్యాల్షియం, మెగ్నీషియం, జింక్‌, ఫాస్ఫరస్‌ లాంటి ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు, పోషకాలు, పీచు పుష్కలంగా ఉంటాయి. వంద గ్రాముల సపోటాల నుంచి 98 కెలొరీల శక్తి లభిస్తుంది.
* అధిక మొత్తంలో కెలొరీలుండే ఈ పండు తక్షణ శక్తిని అందిస్తుంది. జీర్ణక్రియ సక్రమంగా సాగేలా చూస్తుంది.
* ఈ పండులో విటమిన్‌ ఎ మెండుగా ఉంటుంది. దీన్ని తీసుకుంటే కంటి ఆరోగ్యానికి మంచిది. రోగనిరోధకతను పెంచే విటమిన్‌-సి పుష్కలం.
* ఈ పండులోని సుగుణాలు కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచి, ఫ్రీరాడికల్స్‌ను నాశనం చేస్తాయి.
* డయేరియాకు మందుగా పనిచేస్తుంది.పేగు ఆరోగ్యానికి మంచిది. బ్యాక్టీరియల్‌ ఇన్‌ఫెక్షన్స్‌ను తగ్గిస్తుంది.
* యాంటీ వైరల్‌, యాంటీ బ్యాక్టీరియల్‌ సమ్మేళనాలు మెండుగా ఉంటాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని