పచ్చ మిరియాలతో మేలెంతో!

వర్షాకాలంలో జలుబుచేసినా, కఫం వంటివి వేధిస్తున్నా.. మన వంటింట్లో చిటికెలో దొరికే ఔషధం మిరియాలు. ఇవి చూడ్డానికి నల్లగా ఉంటాయి. మరి పచ్చ మిరియాల గురించి తెలుసా?

Published : 26 Jun 2022 00:49 IST

వర్షాకాలంలో జలుబుచేసినా, కఫం వంటివి వేధిస్తున్నా.. మన వంటింట్లో చిటికెలో దొరికే ఔషధం మిరియాలు. ఇవి చూడ్డానికి నల్లగా ఉంటాయి. మరి పచ్చ మిరియాల గురించి తెలుసా?

మామూలు మిరియాలతో పోలిస్తే ఈ పచ్చ మిరియాలు మరిన్ని ప్రయోజనాలు అందిస్తాయి..

ప్రస్తుతం మార్కెట్లో బ్లాక్‌పెప్పర్‌తోపాటు గ్రీన్‌ పెప్పర్‌ పేరుతో పచ్చ మిరియాలు కూడా దొరుకుతున్నాయి. మిరియాలు పూర్తిగా పండకముందే కోసి నీడపట్టున ఆరబెట్టడం ద్వారా వీటిని తయారుచేస్తారు. మామూలు మిరియాలంత ఘాటు ఉండవు కానీ ప్రత్యేకమైన రుచితో ఉంటాయి. కూర్గ్‌ ప్రాంతంలో కాఫీ తర్వాత ఎక్కవమందిని ఆకర్షించేవి ఇవే. వీటిని కూరల్లో వేస్తారు. లేదా నిమ్మరసంలో ఊరబెట్టి పచ్చడి పెడతారు.

* వీటిలోని పెప్రైన్‌ అనే రసాయనం... ఆహారం జీర్ణమవడానికి కావాల్సిన రసాల్ని విడుదలయ్యేటట్టు చేసి జీర్ణశక్తిని పెంచుతుంది.

* మనం తీసుకున్న ఆహారంలో బ్యాక్టీరియా వంటివి ఉంటే అవి పేగుల్లోకి వెళ్లకముందే వాటిని నశింపచేస్తాయి. బాక్టీరియా కారణంగా తలెత్తే పేగు సమస్యలు రాకుండా చేస్తాయి ఈ పచ్చ మిరియాలు.

* మన శరీరంలోని ఫ్రీరాడికల్స్‌ అనేక రకాల అనారోగ్యాలకు కారణం అవుతాయి. ఆరోగ్యవంతమైన కణాలపై దాడిచేసి వాటిని బలహీనపరుస్తాయి. అలా చేయకుండా ఇవి అడ్డుకుంటాయి. కణాల్ని ఆరోగ్యవంతంగా ఉంచి  వయసు ఛాయల్ని కనిపించకుండా చేస్తాయి.

* బరువు తగ్గాలనుకొనేవారు తమ ఆహారంలో పీచు అధికంగా ఉండే వీటిని తీసుకుంటే ఫలితముంటుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని