గ్లాసుని మడత పెట్టేద్దాం

బయటకు వెళ్లినప్పుడు టీ, మంచి నీళ్లు తాగడానికి ప్లాస్టిక్‌ గ్లాసులు వాడుతుంటాం. అవి ఆరోగ్యానికీ, పర్యావరణానికీ ప్రమాదం అని తెలిసినా ప్రత్యామ్నాయం లేక వాటిపైనే ఆధారపడుతుంటాం.

Published : 11 Sep 2022 00:42 IST

యటకు వెళ్లినప్పుడు టీ, మంచి నీళ్లు తాగడానికి ప్లాస్టిక్‌ గ్లాసులు వాడుతుంటాం. అవి ఆరోగ్యానికీ, పర్యావరణానికీ ప్రమాదం అని తెలిసినా ప్రత్యామ్నాయం లేక వాటిపైనే ఆధారపడుతుంటాం. అయితే ఇక నుంచీ అలా రాజీ పడాల్సిన అవసరం లేదేమో! ఎందుకంటే మార్కెట్లోకి కొత్తగా వచ్చిన ‘స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ ఫోల్డింగ్‌ కొలాప్సబుల్‌ కప్పులు’ మన అవసరాలకి అనుగుణంగా మారుతుంటాయి. చూడ్డానికి చిన్న కాయిన్‌లా జేబులో ఇమిడిపోయే ఈ పరికరాన్ని టీ తాగాలనుకున్నప్పుడు స్టీల్‌ కప్పులా మార్చుకోవచ్చు. పనైన తర్వాత... మడతపెట్టి జేబులో ఉంచుకోవచ్చు. వ్యర్థాల సమస్య ఉండదు. ఆరోగ్యానికీ మంచిది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని