సమానంగా కత్తిరించేయొచ్చు...

కొందరు వంట చేస్తే ఎంత పొందిగ్గా చేస్తారో! బొమ్మ గీసినట్టుగా... అన్నీ ఒకే సైజులో ఉండేలా కాయగూరలు తరుగుతారు. వాటిని చక్కగా అలంకరిస్తారు

Published : 04 Dec 2022 00:31 IST

కొందరు వంట చేస్తే ఎంత పొందిగ్గా చేస్తారో! బొమ్మ గీసినట్టుగా... అన్నీ ఒకే సైజులో ఉండేలా కాయగూరలు తరుగుతారు. వాటిని చక్కగా అలంకరిస్తారు. ఇలా చేయాలంటే.. ఆసక్తే కాదు, నైపుణ్యం కూడా ఉండాలిగా అంటారా? అదీ నిజమే. మీలాంటి వారికోసం ఉపకరించే పరికరమే ఈ బౌరోగ్‌ బ్లేడ్‌. టొమాటో, కీరా, వంకాయ ఏదైనా సరే ఏ మందంలో తరగాలనుకుంటున్నారో ఆ మేరకు కత్తిని అమర్చుకుంటే చాలు. ఒకే పరిమాణంలో కాయగూరల్ని తరిగేయొచ్చు. కాయగూర ముక్కలు ఇలా సమానంగా ఉంటే శాండ్‌విచ్‌లు చూడ్డానికి బాగుంటాయి. నోరూరిస్తాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని