తరిగేద్దాం చకచకా

ఇంటిల్లిపాదికి నచ్చే వంటకాలన్నీ వండి వడ్డించాలని ఎవరికుండదు చెప్పండి. అలా వంట పూర్తి కావాలంటే అందుకు అవసరమైన కూరగాయలన్నీ సిద్ధంగా ఉండాలి.

Published : 02 Jul 2023 00:23 IST

ఇంటిల్లిపాదికి నచ్చే వంటకాలన్నీ వండి వడ్డించాలని ఎవరికుండదు చెప్పండి. అలా వంట పూర్తి కావాలంటే అందుకు అవసరమైన కూరగాయలన్నీ సిద్ధంగా ఉండాలి. అయితే, ఇంటా, బయటా ఎన్ని పనులు చేసినా...ఈ పనిని మాత్రం చాలా కష్టంగా భావిస్తారు కొందరు. అలాంటివారికోసమే ఈ ‘మల్టీబ్లేడ్‌ ఫోల్డబుల్‌ అండ్‌ రిమూవబుల్‌ స్లైసర్‌’. పొడవుగా, సన్నగా, గుండ్రగా... కత్తిరించుకునేందుకు ఆరు రకాల బ్లేడ్లు ఇందులో ఉంటాయి. కట్‌ చేసిన ముక్కలన్నీ స్టోరేజ్‌ బాక్సులోకి చేరిపోతాయి. దీన్ని వాడుకున్నాక ఫోల్డ్‌ చేసి ఈ బ్లేడ్లు భద్రపరచడానికి ఉపయోగించొచ్చు. అంతేకాదు... తరిగేటప్పుడు చేతులు గాయపడకుండా గ్రిప్‌ కూడా ఉంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని