ఎర్ర బియ్యంతో ఎన్ని లాభాలో!

మనందరికీ మల్లెపూలను తలపించే తెల్లతెల్లటి అన్నమే ఇష్టం. కానీ ఎప్పుడూ కాకున్నా.. వర్షాకాలంలో రెడ్‌రైస్‌తో వండిన అన్నం తినడం శ్రేష్ఠం అంటున్నారు ఆహార నిపుణులు.

Published : 30 Jul 2023 00:33 IST

నందరికీ మల్లెపూలను తలపించే తెల్లతెల్లటి అన్నమే ఇష్టం. కానీ ఎప్పుడూ కాకున్నా.. వర్షాకాలంలో రెడ్‌రైస్‌తో వండిన అన్నం తినడం శ్రేష్ఠం అంటున్నారు ఆహార నిపుణులు. అందుకు కారణమూ ఉంది.. మామూలు బియ్యంలో కంటే వీటిలో పదింతలు యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. కాపర్‌, ఐరన్‌, జింక్‌, సి,బి,ఇ విటమిన్లు విస్తారంగా ఉన్నాయి. అందువల్ల రెడ్‌ రైస్‌ అన్నం తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వర్షాల వల్ల వచ్చే సాధారనణ అనారోగ్యాలు దరిచేరవు. అంతేకాదు.. ఈ అన్నంతో రక్తపోటు తగ్గుతుంది. ఎముకలు దృఢంగా ఉంటాయి. ఆర్థరైటిస్‌, ఆస్టియోపొరాసిస్‌ లాంటి సమస్యలు తలెత్తవు. జీర్ణప్రక్రియ సజావుగా ఉంటుంది. ఉబకాయం వస్తుందనే బెంగ ఉండదు. బరువు తగ్గడానికి దోహదం చేస్తుంది. గుండె జబ్బులను నిరోధిస్తుంది. ఉబ్బసంతో బాధపడేవారికి ఇది దివ్యౌషధం. ఎర్రబియ్యంతో వండిన అన్నం ఇన్సులిన్‌ స్థాయిని క్రమబద్ధం చేస్తుంది. అన్నిటినీ మించి ఇందులో ఉన్న ఆంథోసియానిన్‌వల్ల చర్మం ముడతలు పడదు, మృదుత్వం, నిగారింపు వస్తాయి. 40 దాటినవారు ఈ అన్నం అలవాటు చేసుకుంటే మంచి పోషకాహారం అందినట్లవుతుంది. ఎర్రబియ్యం కొంచెం దళసరి కనుక వండే ముందు అరగంట నానబెట్టాలి. మామూలు బియ్యం కంటే కొంచెం ఎక్కువ నీళ్లు పోసి ఉడికించాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని