లిట్టీ చోఖా అద్భుతః

బిహారీలు ఇష్టంగా తినే వంటల్లో ‘లిట్టీ చోఖా’ ఒకటి. దీన్నెలా చేయాలంటే.. అర కిలో స్వచ్ఛమైన గోధుమ పిండిలో.. కొన్ని నీళ్లు, కొంచెం నెయ్యి లేదా నూనె, చిటికెడు ఉప్పు వేసి.. పిండి మృదువుగా వచ్చేలా బాగా బీట్‌ చేయాలి.

Updated : 24 Sep 2023 00:08 IST

బిహారీలు ఇష్టంగా తినే వంటల్లో ‘లిట్టీ చోఖా’ ఒకటి. దీన్నెలా చేయాలంటే.. అర కిలో స్వచ్ఛమైన గోధుమ పిండిలో.. కొన్ని నీళ్లు, కొంచెం నెయ్యి లేదా నూనె, చిటికెడు ఉప్పు వేసి.. పిండి మృదువుగా వచ్చేలా బాగా బీట్‌ చేయాలి. లిట్టీలోకి స్టఫ్‌ చేసేందుకు పావు కిలో శనగపిండి, కొద్దిగా ఆవాల నూనె, మసాలా పొడి, జీలకర్ర, వాము, నిమ్మరసం, అల్లం, కొత్తిమీర తరుగు, పచ్చిమిర్చి ముక్కలు, కారం, ఉప్పు వేసి కలపాలి. మరీ గట్టిగా ఉందనిపిస్తే రెండు చెంచాల నీళ్లు పోయొచ్చు. గోధుమ పిండిని నిమ్మకాయ పరిమాణంలో తీసుకుని.. చిన్న పూరీల్లా చేసి, మధ్యలో ఒకటిన్నర చెంచా శనగపిండి మిశ్రమం ఉంచి పూర్ణంలా చుట్టాలి. కడాయిలో నూనె కాగాక.. వీటిని బంగారు రంగు వచ్చేదాకా వేయిస్తే సరి.. వహ్వా అనిపించే లిట్టీలు సిద్ధమైపోతాయి. ఇక చోఖా కోసం.. వంకాయలు, టొమాటోలను కడిగి, తుడిచి యథాతథంగా నూనెలో వేయిస్తారు. అవి చల్లారాక పై పొట్టు తీసేసి లిట్టీల పక్కన అమరుస్తారు. ఉల్లి ఇష్టపడేవారు.. సన్నగా తరిగి వాటి మీద జల్లుతారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని