నీటి గుర్రమంత గుమ్మడి!

కూరగాయల్లో అతి పెద్దదంటే గుమ్మడికాయే. సొరకాయ కూడా పెద్దగానే ఉన్నా.. గుండ్రంగా ఉండటాన గుమ్మడి మరీ పెద్దగా అనిపిస్తుంది.

Published : 15 Oct 2023 00:36 IST

కూరగాయల్లో అతి పెద్దదంటే గుమ్మడికాయే. సొరకాయ కూడా పెద్దగానే ఉన్నా.. గుండ్రంగా ఉండటాన గుమ్మడి మరీ పెద్దగా అనిపిస్తుంది. ఎంత పెద్దనుకున్నా మహా అయితే ఐదు కిలోలు ఉంటుంది. కానీ క్యాలిఫోర్నియాలో ఎంత పెద్ద గుమ్మడికాయ పండించారంటే.. దాని బరువు అక్షరాలా 1247 కిలోలు. వామ్మో ఎంత బరువు! ప్రపంచ రికార్డు సృష్టించిన ఈ కాయ ఒక నీటి గుర్రం బరువుతో (హిప్పోపొటమస్‌) సమానం. ఈ గజగుమ్మడి కాయను పండించిన రైతు 30 వేల డాలర్ల బహుమతి అందుకున్నాడు. రూపాయల్లో చెప్పాలంటే పాతిక లక్షలన్నమాట. దీంతో ఎన్ని వందలమందికి కూర వండిపెట్టొచ్చో కదా!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని