ఈ ఏడాది తొమ్మిది ఫుడ్‌ రికార్డులు

అత్యంత బరువైన కూరగాయ, అతి పెద్ద చాక్లెట్‌- లాంటి వింత విషయాలు ఆసక్తి కలిగిస్తాయి కదూ! ఈ ఏడాది- అతి పెద్ద పిజ్జా, ఖరీదైన ఐస్‌క్రీం లాంటివి గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో చోటు సంపాదించాయి. వివరంగా చెప్పాలంటే.. జనవరిలో అమెరికన్‌ యూట్యూబర్‌ 13,95,777 అడుగుల పిజ్జాను రూపొందించాడు.

Published : 24 Dec 2023 00:12 IST

అత్యంత బరువైన కూరగాయ, అతి పెద్ద చాక్లెట్‌- లాంటి వింత విషయాలు ఆసక్తి కలిగిస్తాయి కదూ! ఈ ఏడాది- అతి పెద్ద పిజ్జా, ఖరీదైన ఐస్‌క్రీం లాంటివి గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో చోటు సంపాదించాయి. వివరంగా చెప్పాలంటే.. జనవరిలో అమెరికన్‌ యూట్యూబర్‌ 13,95,777 అడుగుల పిజ్జాను రూపొందించాడు. ఫిబ్రవరిలో కౌలాలంపూర్‌లో ‘మలేషియా బెర్సాటు క్యూలినరీ అసోసియేషన్‌’ అతి పెద్ద వంటల పోటీ నిర్వహించింది. అందులో 713 మంది కుక్స్‌ పాల్గొన్నారు. మేలో జపాన్‌లోని క్రీం బ్రాండ్‌ సెల్లాటో ‘బ్యాకుయా’ అనే కాస్ట్‌లీ ఐస్‌క్రీం అమ్మింది. దాని ఖరీదు 8,73,400 యెన్‌లు. మన కరెన్సీలో ఐదు లక్షల ఇరవై వేలు. ఇందులో తినదగ్గ బంగారం లాంటివెన్నో జతచేశారు. జూన్‌లో ప్రఖ్యాత చెఫ్‌లు నిక్‌ డిజియోవన్ని, గార్డన్‌ రమ్సేలు చేసిన ‘బ్రిటిష్‌ స్టీక్‌ డిష్‌’ ఎక్కువ పరిమాణంతో రికార్డు సృష్టించింది. జులైలో రస్సెల్‌ స్టోవర్‌ అనే అమెరికన్‌ చాకొలెట్‌ కంపెనీ 2547.50 కిలోల బరువున్న లార్జెస్ట్‌ చాకొలెట్‌ బాక్స్‌ తయారుచేసింది. ఆగస్టులో ఇంగ్లండుకు చెందిన లీ షట్‌కెవర్‌ పాస్తా, శాకాహార నగ్గెట్స్‌ను క్షణాల్లో తిని స్పీడ్‌ ఈటర్‌గా నిలిచాడు. సెప్టెంబర్‌లో కేరళ ఫుడ్‌బాల్‌ స్టేడియంలో 732 అడుగుల పొడవుతో లాంగెస్ట్‌ బ్రౌనీ తయారుచేశారు. ఇందులో రసాయనాల్లేని, కృత్రిమం కాని సహజ సరుకులే ఉపయోగించారు. అక్టోబర్‌లో 1246.9 కిలోల గుమ్మడికాయ, పెప్పర్‌ ఎక్స్‌ అనే హాటెస్ట్‌ చిల్లీలు రికార్డుగా నిలిచాయి. నవంబర్‌లో అలన్‌ ఫిషర్‌ 119 గంటల 57 నిమిషాలతో లాంగెస్ట్‌ కుకింగ్‌ మారథానర్‌గా నిలిచాడు. ఇతను జపాన్‌లో ఒక హోటల్‌కు యజమాని, చెఫ్‌ కూడా. ఆహారానికి సంబంధించి- ఏడాదిలో ఏకంగా తొమ్మిది రికార్డులంటే మాటలా చెప్పండి!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని