గ్రీన్‌ టీ ఇలా చేద్దామా...

టీ ఇష్టపడని వాళ్లు చాలా తక్కువ. అందునా చలికాలంలో మళ్లీ మళ్లీ తాగుతారు. అయితే మామూలు చాయ్‌ కంటే గ్రీన్‌ టీ మరీ మంచిది. దానికి అల్లం లాంటివి జోడించారంటే. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.

Published : 31 Dec 2023 00:12 IST

టీ ఇష్టపడని వాళ్లు చాలా తక్కువ. అందునా చలికాలంలో మళ్లీ మళ్లీ తాగుతారు. అయితే మామూలు చాయ్‌ కంటే గ్రీన్‌ టీ మరీ మంచిది. దానికి అల్లం లాంటివి జోడించారంటే. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.

  • గ్రీన్‌ టీలో కాస్త దాల్చినచెక్క వేస్తే.. మంచి వాసన, అదనపు రుచి వస్తుంది. రోగనిరోధకశక్తి పెరుగుతుంది. రక్తంలో చక్కెర స్థాయి క్రమబద్ధం అవుతుంది.
  • తాజా అల్లం ముక్కలు లేదా శొంఠిపొడి చాయ్‌లో వేయడం వల్ల ఔషధంలా పనిచేస్తుంది. దీని వల్ల ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి. శ్వాస ఇబ్బందులు తలెత్తవు. వాంతులు, వికారం లాంటివి తగ్గుతాయి.  
  • గ్రీన్‌ టీలో కాస్త పసుపు జోడిస్తే రోగనిరోధక శక్తి మరింత పెరుగుతుంది. శరీరంలో చేరిన సూక్ష్మక్రిములు నశిస్తాయి.
  • లవంగాలతో ఘాటైన రుచీ పరిమళాలు జతచేరతాయి. వీటిల్లోని యాంటీఆక్సిడెంట్లు, యాంటీ మైక్రోబియల్‌ గుణాలు దగ్గు, జలుబు లాంటి సాధారణ అనారోగ్యాలను దూరం చేస్తాయి.
  • ఇలాచీ పొడి వేస్తే.. ఆ పరిమళం కొత్త ఉత్సాహాన్నిస్తుంది. ఇమ్యూనిటీ పెరుగుతుంది. మిరియాల పొడి కూడా అంతే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని