నిద్రలేమికి చెక్‌పెట్టే వాల్‌నట్స్‌

వాల్‌నట్స్‌ మనదేశంలో పండే పంట కాదు కనుక.. ఇంగ్లిష్‌ పేరుతోనే ప్రసిద్ధం. మన నిఘంటువుల్లో కొండగోగు, ఱేలచెట్టు.. అన్నారు కానీ అలా చెబితే ఎవరికీ అర్థం కాదు. పేరు ఏదైతేనేం.. ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి. బాదంపప్పుల్లా వీటిలో పోషకాలు అధికం.

Published : 07 Jan 2024 00:55 IST

వాల్‌నట్స్‌ మనదేశంలో పండే పంట కాదు కనుక.. ఇంగ్లిష్‌ పేరుతోనే ప్రసిద్ధం. మన నిఘంటువుల్లో కొండగోగు, ఱేలచెట్టు.. అన్నారు కానీ అలా చెబితే ఎవరికీ అర్థం కాదు. పేరు ఏదైతేనేం.. ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి. బాదంపప్పుల్లా వీటిలో పోషకాలు అధికం. వాల్‌నట్స్‌లో సోడియం, పీచు, క్యాల్షియం, ఐరన్‌, పొటాషియం, విటమిన్లు, గుడ్‌ కొలెస్ట్రాల్‌.. ఇలా శరీరానికి అవసరమైనవెన్నో ఉన్నాయి. రక్తపోటు తగ్గుతుంది. టైప్‌-2 డయాబెటిస్‌ నుంచి ఉపశమనం కలుగుతుంది. ఎముకలు, దంతాలు దృఢంగా ఉంటాయి. జీర్ణప్రక్రియ బాగుంటుంది. మెదడు చురుగ్గా పనిచేస్తుంది. మతిమరపు రాదు. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. కురులు ఆరోగ్యంగా ఉంటాయి. అధిక బరువుతో బాధపడేవారికి ఇవి మంచి ఆహారం. ఊబకాయం రాకుండా, తగినంత బరువు ఉండేలా సాయపడతాయి. శరీరంలో చేరిన హాని కలిగించే బ్యాక్టీరియాను నశింపచేసి, అనారోగ్యాల పాలు కాకుండా కాపాడతాయి. క్యాన్సర్‌ను నిరోధిస్తాయి. చర్మం ముడతలు పడదు, నిగారిస్తుంది. వీటిలోని ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌ గుండె జబ్బులను నిరోధిస్తాయి. సాధారణంగా రోజుకు నాలుగైదు వాల్‌నట్స్‌ వరకూ తినొచ్చు. అలాగే తింటే.. అంత రుచిగా ఉండవనుకుంటే.. ఫ్రూట్‌ సలాడ్‌, సాస్‌, ఓట్‌మీల్‌, శాండ్‌విచెస్‌, పాస్తాల్లో వేసుకోవచ్చు. నిద్రలేమితో బాధపడేవారు వీటిని క్రమం తప్పకుండా తినడం వల్ల ప్రయోజనం ఉంటుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని