ఇవి తింటే... తాజా శ్వాస!

ఇంట్లోంచి బయటకొచ్చామంటే కాలుష్యం బారిన పడుతున్నట్టే. ఈ ప్రభావానికి ముందుగా లోనయ్యేవి ఊపిరితిత్తులే. అందుకే  వాటి ఆరోగ్యాన్ని కాపాడే ఆహారం గురించి తెలుసుకుందాం..

Published : 19 Jun 2022 01:07 IST

ఇంట్లోంచి బయటకొచ్చామంటే కాలుష్యం బారిన పడుతున్నట్టే. ఈ ప్రభావానికి ముందుగా లోనయ్యేవి ఊపిరితిత్తులే. అందుకే  వాటి ఆరోగ్యాన్ని కాపాడే ఆహారం గురించి తెలుసుకుందాం..

బీట్‌రూట్‌: ఈ దుంపలో నైట్రేట్‌లు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచి ఎక్కువ ఆక్సిజన్‌ తీసుకొనేలా చేస్తాయి.

యాపిల్‌: ధూమపానం చేసి ఊపిరితిత్తుల సామర్థ్యం తగ్గినవారిలోనూ... అవి తిరిగి పుంజుకోవడానికి యాపిల్స్‌ సహకరిస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. వారానికి ఐదు నుంచి ఆరు యాపిల్స్‌ తినడం వల్ల ఊపిరితిత్తుల సామర్థ్యం గణనీయంగా పెరుగుతుందట.

పసుపు: దీనిలోని కర్‌క్యుమిన్‌ అనే ప్రత్యేక మూలకం ఉండటంతోపాటు... యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉండటం వల్ల ఊపిరితిత్తులకు మేలు జరిగి వాటి సామర్థ్యం పెరుగుతుంది.

పెరుగు: శ్వాస సంబంధ సమస్యలకు కారణమయ్యే సీˆఓపీడీని పెరుగులోని క్యాల్షియం అడ్డుకుంటుందని జపాన్‌లో తాజాగా జరిగిన అధ్యయనాలు చెబుతున్నాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని