Jackfruit: ఆవిరి పీల్చినా చాలు..!

పనసపండులో ఎ విటమిన్‌తోపాటు... కెరోటినాయిడ్లు పెద్ద మొత్తంలో ఉంటాయి. ఇవి కంటిచుట్టూ ఉండే మ్యూకస్‌పొరని కాపాడి చూపు మందగించకుండా చూస్తాయి.

Updated : 11 Feb 2024 14:13 IST

చూపు చురుగ్గా: పనసపండులో ఎ విటమిన్‌తోపాటు... కెరోటినాయిడ్లు పెద్ద మొత్తంలో ఉంటాయి. ఇవి కంటిచుట్టూ ఉండే మ్యూకస్‌పొరని కాపాడి చూపు మందగించకుండా చూస్తాయి. వయసు పెరుగుతున్న కొద్దీ కంటిచూపు మందగించడం సహజమే అయినా ఆ మార్పుని నెమ్మదించేలా చేస్తుంది పనస.

అలసట వేధిస్తోందా?: రక్తహీనత ఉన్నవారు ఇట్టే అలసిపోతూ ఉంటారు. ఈ సమస్య నుంచి బయటపడటానికి పనస దివ్యౌషధం. దీనిలో విటమిన్‌ సి సమృద్ధిగా ఉంటుంది. దాంతో మన ఆహారంలోని ఇనుముని శరీరం తేలిగ్గా గ్రహిస్తుంది.

ఆస్థమాతో ఇబ్బందా: ఈ సమస్య ఉన్నవారిలో వ్యాధినిరోధక శక్తి తక్కువగా ఉన్నా, వాతావరణంలో కాలుష్యం ఉన్నా సమస్య మరింతగా ఇబ్బంది పెడుతుంది. అలాంటప్పుడు పనసని ఉడికించిన ఆవిరి మంచిదని అధ్యయనాలు చెబుతున్నాయి. కారణం ఆ ఆవిరిలోని బయో ఫ్లెవనాయిడ్లు ఉబ్బసం నుంచి విముక్తి కలిగిస్తాయి.

ఎముకలు విరగకుండా: ఓ వయసు వచ్చాక శరీరంలో కాల్షియం స్థాయిలు తగ్గుతూ ఉంటాయి. ఈ సమస్య మహిళల్లో మరీ ఎక్కువ. అదే కొనసాగితే ఎముకలు గుల్లబారి చిటికీమాటికీ విరిగిపోతుంటాయి. ఇలా జరగకుండా ఉండాలంటే తరచూ పనసని ఆహారంలో చేర్చుకోవాలి. ఎందుకంటే ఈ పండులో క్యాల్షియం స్థాయిలు ఎక్కువ. ఎముకని గుల్లబారకుండా చేసి దాని సాంద్రతని పెంచుతుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని