దానిమ్మ గౌను...కొత్తిమీర డ్రెస్సు!

అందమైన దుస్తులు డిజైన్‌ చేయాలంటే ఏం కావాలి? ఏం కావాలి.. చక్కని వస్త్రాలు, వాటికి తోడుగా చూడచక్కని యాక్సెసరీలు కదా! రుబీ పర్మాన్‌కి అవేమి అవసరం లేదు.

Updated : 26 Mar 2023 10:32 IST

అందమైన దుస్తులు డిజైన్‌ చేయాలంటే ఏం కావాలి? ఏం కావాలి.. చక్కని వస్త్రాలు, వాటికి తోడుగా చూడచక్కని యాక్సెసరీలు కదా! రుబీ పర్మాన్‌కి అవేమి అవసరం లేదు. కాసిని స్ట్రాబెర్రీలో, చెంచాడు నూడుల్సో, గిన్నెడు దానిమ్మ గింజలో దొరికితే చాలు. వాటితో అందమైన దుస్తులు డిజైన్‌ చేసేస్తుంది. వాటితో దుస్తులా అని ఆశ్చర్యపోవద్దు. ఎందుకంటే రుబీ ఫుడ్‌ స్టైలిస్ట్‌ కాబట్టి! ఆహారంతో సెలబ్రిటీలకు దుస్తులు డిజైన్‌ చేస్తూ సామాజిక మాధ్యమాల్లో పేరు తెచ్చుకుంది రుబీ. మిషెల్‌ఒబామా, ఓప్రావిన్‌ఫ్రే, లేడీగాగా వంటివారు ముచ్చటపడి ఆమెతో డ్రస్‌ డిజైనింగ్‌ చేయించుకోవడం కొసమెరుపు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని