బూట్లు తింటారా!

గోల్డ్‌రష్‌ సినిమాలో చార్లీచాప్లిన్‌ తన బూట్లు ఉడికించుకు తినడాన్ని ఎప్పటికీ మర్చిపోలేం కదూ! అది ఆకలిఘోష. ఇప్పుడు కోకోపాట్స్‌ అనే కేఫ్‌ ఎడిబుల్‌ పింక్‌ బార్బీ షూస్‌ రూపొందించి జనాల్ని ఆకట్టుకుంది.

Published : 30 Jul 2023 00:35 IST

గోల్డ్‌రష్‌ సినిమాలో చార్లీచాప్లిన్‌ తన బూట్లు ఉడికించుకు తినడాన్ని ఎప్పటికీ మర్చిపోలేం కదూ! అది ఆకలిఘోష. ఇప్పుడు కోకోపాట్స్‌ అనే కేఫ్‌ ఎడిబుల్‌ పింక్‌ బార్బీ షూస్‌ రూపొందించి జనాల్ని ఆకట్టుకుంది. ఎందుకంటారా... మార్గరెట్‌ రాబీ, ర్యాన్‌ గోప్లింగ్‌ నటించగా.. ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది ఎదురుచూసిన బార్బీ చిత్రం భారీ అంచనాలతో జులై 21న విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్ర ప్రచారం జోరందుకున్న నేపథ్యంలో అనేక కంపెనీలు తమ తమ ఉత్పత్తులను బార్బీకి అనుగుణంగా సృజించేందుకు ప్రయత్నించాయి. దిల్లీ కమలా నగర్‌లో భోజనప్రియులకు మహా ఇష్టమైన కోకోపాట్స్‌ కేఫ్‌ కూడా అందుకు మినహాయింపు కాదు. న్యూయార్క్‌ నగరానికి చెందిన చెఫ్‌ రితికా ఈ కోకోపాట్స్‌ కేఫ్‌కు యజమానురాలు. క్రేజ్‌ సృష్టించిన ఆ సినిమా ప్రభావంతో ఈ కేఫ్‌ బార్బీకి సంకేతమైన గులాబీరంగు బర్గర్‌, బబుల్‌గమ్‌, మిల్క్‌షేక్‌, స్పెషల్‌ ఫ్రైస్‌, పింక్‌సాస్‌లతో ప్రత్యేక మెనూ రూపొందించింది. అంతటితో ఆగితే అందులో ప్రత్యేకత ఏమీ లేదు. పింక్‌ పాస్తాను, బార్బీ చెప్పులను పోలిన తినదగిన (ఎడిబుల్‌) పింక్‌ బూట్లను సైతం తయారుచేసింది. ఇన్‌స్టగ్రామ్‌లో షేర్‌ చేసిన ఈ వీడియో బాగా వైరల్‌ అయ్యింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు