నోరూరించే సొరకాయ రొట్టె
గుజరాతీల వంటకాలకు ఒక ప్రత్యేక రుచి, పరిమళం ఉంటాయి. వాళ్లు ఆరోగ్య సూత్రాలు పాటించడం కొంచెం ఎక్కువే. అందుకే వీలై నప్పుడల్లా మట్టి పాత్రల్లో వండటానికి ప్రయత్నిస్తారు.
గుజరాతీల వంటకాలకు ఒక ప్రత్యేక రుచి, పరిమళం ఉంటాయి. వాళ్లు ఆరోగ్య సూత్రాలు పాటించడం కొంచెం ఎక్కువే. అందుకే వీలై నప్పుడల్లా మట్టి పాత్రల్లో వండటానికి ప్రయత్నిస్తారు. అన్నిటినీ మించి కారం తక్కువగా వాడతారు. కూరలూ, చిరుతిళ్లూ.. ఏవీ స్పైసీగా ఉండకపోగా కొంచెం తియ్యగానే ఉంటాయి. గుజరాత్‌లో ఇష్టంగా తినే పదార్థాల్లో ‘హాండవో’ ఒకటి. ఇది సొరకాయతో చేసే రొట్టె. తమ తమ ఇష్టాన్ని బట్టి ఇతర దుంపలు, కూరగాయలు జతచేస్తారు. ఇంతకీ ఈ వంటకం ఎలా చేస్తారంటే.. బియ్యం, కందిపప్పు, శనగపప్పు, మినప్పప్పు, పెసర పప్పులను నానబెట్టి గ్రైండ్ చేయాలి. అందులో కాస్త పెరుగు, కొన్ని నీళ్లు పోసి ఇడ్లీ పిండిలా తయారు చేయాలి. సొరకాయ, క్యారెట్‌ల తరుగు, అల్లం, పచ్చిమిర్చి ముద్ద, పాలకూర, కొత్తిమీర, ఉప్పు, కారం, పంచదార, బేకింగ్ సోడా, నిమ్మరసం.. వీటన్నిటినీ పిండిలో కలిపి, అవెన్‌లో బేక్ చేసి.. తాలింపు వేస్తే ఘుమఘుమలాడే ‘హాండవో’ తయారైపోతుంది. వింటేనే నోరూరుతోందా! అయితే మీరూ చేసి చూడండి!
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Nara Lokesh: ఇదేం అరాచక పాలన..? బండారు అరెస్టును ఖండించిన లోకేశ్
-
Siddharth: అప్పుడు వెక్కి వెక్కి ఏడ్చా: సిద్ధార్థ్
-
Tragedy: ‘మహా’ ఘోరం.. ఆస్పత్రిలో ఒకేరోజు 12మంది శిశువులు సహా 24 మంది మృతి
-
Ts News: ఉద్యోగులకు గుడ్న్యూస్.. ఎన్ శివశంకర్ ఛైర్మన్గా పీఆర్సీ ఏర్పాటు
-
The Vaccine War: ‘ది వ్యాక్సిన్ వార్’పై స్పందించిన వివేక్ అగ్నిహోత్రి.. ఏమన్నారంటే?
-
Social Look: సమంత కల.. రుక్సార్ హొయలు.. నిహారిక ఫొటోషూట్