అహల్య ప్రాయశ్చిత్తం

పూర్వం సత్యవర్ష మహర్షి అనే జ్ఞాని అరణ్యంలో కుటీరం ఏర్పరచుకుని, వేదపాఠాలు నేర్పేవాడు. ఒకసారి ఓ శిష్యుడు ‘గురుదేవా! ఎంతోకాలంగా నన్నొక సంశయం పట్టిపీడిస్తోంది. దాన్ని తీర్చాల్సిందిగా ప్రార్థిస్తున్నాను’ అంటూ చేతులు జోడించాడు.

Published : 04 Jan 2024 00:08 IST

పూర్వం సత్యవర్ష మహర్షి అనే జ్ఞాని అరణ్యంలో కుటీరం ఏర్పరచుకుని, వేదపాఠాలు నేర్పేవాడు. ఒకసారి ఓ శిష్యుడు ‘గురుదేవా! ఎంతోకాలంగా నన్నొక సంశయం పట్టిపీడిస్తోంది. దాన్ని తీర్చాల్సిందిగా ప్రార్థిస్తున్నాను’ అంటూ చేతులు జోడించాడు. ఏమిటో చెప్పమన్నారాయన. ‘అయ్యా! దేవేంద్రుడిది తేజోమయమైన దివ్యదేహం. అహల్యది మట్టితో కూడినది. ఈ రెండు దేహాలకూ సాంగత్యం కుదరదు కదా! మరి దీన్నెలా అర్థం చేసుకోవాలి?’ అనడిగాడు.

‘నాయనా! అహల్య భావపరమైన మోహానికి పాల్పడింది. అందువల్ల భర్త శపించాడు. సంవత్సరాల తరబడి ఆమె ఆకలిదప్పులు లేని ఒక శిలామూర్తిగా ఉండిపోయింది. అలా ప్రాయశ్చిత్తం చేసుకోవడం వల్ల తన మానసిక దోషాన్ని సంపూర్ణంగా ప్రక్షాళన చేసుకుంది. అది చాలక.. పరమ పావనమైన శ్రీరామచంద్రుడి పాదస్పర్శకూ నోచుకుంది. అందువల్లే ఆమె కడిగిన ముత్యంలా ప్రకాశించింది. పతివ్రతా శిరోమణుల్లో తొలి స్థానం అందుకుని పూజ్యురాలయ్యింది. కేవలం మానసిక దోషానికే అంత ప్రాయశ్చిత్తం చేసుకున్నదంటే.. ఇక మనలాంటి సామాన్యులు ఎంత అప్రమత్తంగా ఉండాలో, ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో.. అహల్యగాథ తెలియచేస్తుంది’ అంటూ వివరించాడు సత్యవర్ష మహర్షి.

శివరాజేశ్వరి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని