హనుమంతుడి ఒంటి నిండా సిందూరం ఎందుకు ఉంటుంది?

సిందూరం అంటే మనం పెట్టుకునే కుంకుమ. హనుమంతుడు సింధూర ప్రియుడు కావడం వెనుక కథను ‘పరాశరసంహిత’ వర్ణించింది. సీతమ్మ పాపిట బొట్టు పెట్టుకోవడం చూసిన ఆంజనేయుడు ఓసారి ఎందుకలా పెట్టుకుంటున్నావని అడిగాడు. ...

Updated : 07 Feb 2019 21:31 IST

 సిందూరం అంటే మనం పెట్టుకునే కుంకుమ. హనుమంతుడు సిందూర ప్రియుడు కావడం వెనుక కథను ‘పరాశరసంహిత’ వర్ణించింది. సీతమ్మ పాపిట బొట్టు పెట్టుకోవడం చూసిన ఆంజనేయుడు ఓసారి ఎందుకలా పెట్టుకుంటున్నావని అడిగాడు. అందుకు సీతమ్మ నవ్వుతూ ఈ పాపిట బొట్టువలన నేను రామప్రేమను పొందానని చెప్పింది. ఈ బొట్టు రామయ్యకు చాలా ఇష్టమని చెప్పింది. దీంతో వెంటనే హనుమంతుడు సిందూరాన్ని ఒంటినిండా పూసుకున్నాడు. ఆయనకు ఆపాదమస్తకం రోమాలు ఉండటం చేత ఆ సిందూరం వెంటనే రాలిపోయేది. దీంతో ఆయన నూనెతో కలిపిన గంగ సిందూరాన్ని ఒంటినిండా పట్టించుకున్నాడట. ఈ అమాయకపు పని చేసిన ఆంజనేయుడ్ని చూసిన శ్రీరాముడు ‘ఈ రూపంతో నిన్ను ఎవరైతే సేవిస్తారో వారికి నేను ప్రసన్నుడను’ అని అన్నాడట. అటువంటి భక్తులకు సమస్త దోషాలూ తొల‌గి సుఖశాంతులు పొందుతారని వరం ఇచ్చాడు. అందుకే హనుమంతుడి ఒంటి నిండా సిందూరం పూసి ఉంటుంది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని