Cyber Safety: గూగుల్, జొమాటో కలిసి చేసిన సైబర్‌ సేఫ్‌‘టీ’.. ఎలా చేయాలో తెలుసా?

సేఫర్‌ ఇంటర్నెట్‌ డే(SID)ను పురస్కరించుకుని సైబర్‌ భద్రత (Cyber Safety) ప్రాధాన్యం గురించి వివరిస్తూ గూగుల్ ఇండియా (Google India), జొమాటో(Zomato) ఒక ఆసక్తికరమైన వీడియోను రూపొందించాయి. 

Published : 07 Feb 2023 22:01 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆన్‌లైన్‌లో జరిగే సైబర్‌ మోసాల (Cyber Frauds) గురించి టెక్‌ కంపెనీలు, ప్రభుత్వాలు, పోలీసు విభాగం ఎప్పటికప్పుడు యూజర్లకు అవగాహన కల్పిస్తున్నాయి. కానీ, పలువురు యూజర్ల అవగాహన లోపం సైబర్‌ నేరగాళ్ల (Cyber Criminals)కు వరంగా మారుతోంది. ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా సేఫర్‌ ఇంటర్‌నెట్‌ డే (SID)ను జరుపుకుంటారు. ఈ సందర్భంగా సైబర్‌ భద్రత (Cyber Safety)పై అవగాహన కల్పించేందుకు గూగుల్ ఇండియా (Google India), జొమాటో (Zomato) కలిసి ఒక ఆసక్తికర వీడియోను రూపొదించాయి.

ఇంటర్నెట్‌ సైబర్‌ సేఫ్‌-టీ (Internet Cyber Safe-Tea) రెసిపీ పేరుతో రూపొందించిన ఈ వీడియోలో  పాస్‌వర్డ్‌ (Password)లో అప్పర్‌ క్యారెక్టర్స్‌, నంబర్స్‌, స్పెషల్‌ క్యారెక్టర్స్‌, టూ-స్టెప్‌ వెరిఫికేషన్‌ (Two-Step Verification) ప్రాధాన్యాన్ని వివరించారు. టీ పాత్రను పాస్‌వర్డ్‌ అనే పేరుతో, నీళ్లను క్యాపిటల్‌ లెటర్స్‌, టీ పొడిని స్మాల్‌ లెటర్స్‌, షుగర్‌ను స్పెషల్‌ క్యారెక్టర్స్‌, పాలను నంబర్స్‌గా చూపించారు. తర్వాత టీ మరిగించేందుకు పాత్రపై ఉంచే ప్లేట్‌ను పాస్‌వర్డ్‌ చెకప్‌గా, టీ కప్‌ను అకౌంట్‌ సేఫ్టీగా, టీ ఫిల్టర్‌ను టూ-స్టెప్‌ వెరిఫికేషన్‌తో పోలుస్తూ చివరిగా సైబర్‌ సేఫ్‌-టీని ఎంజాయ్‌ చేయండి అంటూ వీడియోను ముగించారు. ఈ వీడియోను గూగుల్ ఇండియా ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో షేర్‌ చేయడంతో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ‘ ఇది సైబర్‌ సేఫ్‌-టీ కాదు, ఛాయ్‌బర్‌ సేఫ్టీ (Chaiber Safety)’, ‘మార్కెటింగ్ ఎలా చేయాలనేది గూగుల్ నుంచే నేర్చుకోవాలి’, ‘మరి కాఫీ తాగే వారి పరిస్థితేంటీ’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. 



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని