ఫ్యాషన్‌ ‘లైన్లో’ పడింది

1990ల నాటి ఫ్యాషన్‌ మళ్లీ రిపీట్‌ అవుతోందా? అవుననే అంటోంది ఫ్యాషన్‌ ప్రపంచం. పెద్దపెద్ద చారలు, గళ్ల షర్ట్‌లకు 1990 నుంచి 95 మధ్య కాలంలో మంచి క్రేజ్‌ ఉండేది. తర్వాత అవి మరుగున పడిపోయాయి. ప్లెయిన్‌ షర్ట్స్‌ మీద యువతకు ఆసక్తి పెరిగిపోవడంతో...

Published : 04 May 2019 00:03 IST

1990ల నాటి ఫ్యాషన్‌ మళ్లీ రిపీట్‌ అవుతోందా? అవుననే అంటోంది ఫ్యాషన్‌ ప్రపంచం. పెద్దపెద్ద చారలు, గళ్ల షర్ట్‌లకు 1990 నుంచి 95 మధ్య కాలంలో మంచి క్రేజ్‌ ఉండేది. తర్వాత అవి మరుగున పడిపోయాయి. ప్లెయిన్‌ షర్ట్స్‌ మీద యువతకు ఆసక్తి పెరిగిపోవడంతో... గీతల చొక్కాలు ఉన్నా అంతగా ఆదరణ పొందేవి కావు. ఇప్పుడు ‘మహర్షి’ సినిమాలో మహేశ్‌బాబు, అల్లరి నరేష్‌, పూజాహెగ్డె... లైన్స్‌, చెక్స్‌ డిజైన్లలో కన్పించి అలరిస్తున్నారు. ప్రస్తుత ట్రెండ్‌కు అనుగుణంగా రంగులు, నాణ్యమైన వస్త్రం వీటిని మేటిగా నిలుపుతున్నాయి. ఈ షర్ట్స్‌ని అమ్మాయిలు, అబ్బాయిలు ఇద్దరూ ఇష్టపడుతుండటంతో క్రేజ్‌ మరింత పెరిగింది. లైన్స్‌, చెక్స్‌ మోడల్స్‌లోనే అమ్మాయిలకు స్కర్ట్‌లు, సల్వార్లు తయారు చేసి మార్కెట్లోకి వదులుతున్నారు డిజైనర్లు. జాకెట్లు, సూట్లలోనూ ఇదే ట్రెండ్‌ ఫాలోఅవుతున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని