పరిశోధనల మేటికి.. ప్రతిష్ఠాత్మక ఫెలోషిప్!
శాంటాబార్బరాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా. అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఒకవైపు పాఠాలు బోధిస్తూనే.. మరోవైపు ఖగోళ భౌతిక శాస్త్రవేత్తగా పరిశోధనలు చేస్తున్నాడు తేజస్వి.
స్లోన్ రిసెర్చ్ ఫెలోషిప్... ప్రపంచవ్యాప్తంగా అతికొద్దిమందికే దక్కే ప్రతిష్ఠాత్మక గుర్తింపు. మానవాళిపై సానుకూల ప్రభావం చూపిస్తున్న సృజనాత్మక పరిశోధకులకు ఏటా ఇస్తుంటారు. ఎంపికైన వారికి సంవత్సరానికి రూ.62 లక్షల చొప్పున రెండేళ్లు అందజేస్తారు. ఈ ఏడాది ఆ మెరికల జాబితాలో మన హైదరాబాదీ నేరెళ్ల తేజస్వి వేణుమాధవ్ ఉన్నాడు. ఇదొక్కటే కాదు.. అతడి ప్రతిభకు చాలా అవార్డులే సలాం చేశాయి. భారీ నజరానాలు అందాయి. తనతో మాట కలిపింది ఈతరం.
శాంటాబార్బరాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా. అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఒకవైపు పాఠాలు బోధిస్తూనే.. మరోవైపు ఖగోళ భౌతిక శాస్త్రవేత్తగా పరిశోధనలు చేస్తున్నాడు తేజస్వి. గ్రావిటేషనల్ వేవ్స్ అండ్ కాస్మాలజీలో భాగంగా కృష్ణబిలాలు (బ్లాక్‌హోల్స్), న్యూట్రాన్ నక్షత్రాల గుట్టు విప్పడంలో తలమునకలై ఉన్నాడు. ఆస్ట్రో ఫిజిసిస్ట్‌గా తను రాసిన పరిశోధక వ్యాసాలు, సమర్పించిన పత్రాలు ప్రఖ్యాత సైన్స్ మ్యాగజైన్లలో ప్రచురితం అయ్యాయి. ఆ ప్రతిభ ఫలితమే ఈ ప్రఖ్యాత ఫెలోషిప్. దిగ్గజ భౌతిక శాస్త్రవేత్తలు రిచర్డ్ ఫీన్మన్, ముర్రే జెల్మన్.. ఫాదర్ ఆఫ్ మోడర్న్ గేమ్ థియరీగా పేరొందిన ప్రఖ్యాత గణిత శాస్త్రవేత్త జాన్ నాష్‌లు సైతం గతంలో ఈ పురస్కారానికి ఎంపికయ్యారు. ఈ ఫెలోషిప్ పొందినవారిలో 56మంది శాస్త్రవేత్తలు ప్రఖ్యాత నోబెల్ అవార్డు అందుకోవడం విశేషం.
రహస్యాల శోధనలో..
ముప్ఫై మూడేళ్లకే పరిశోధనల మేటిగా పేరొందాడు తేజస్వి. దీనికి చిన్నతనంలోనే పునాది పడింది. నక్షత్రాలు, ఖగోళం, విశ్వం గురించి బాబాయ్ గుప్త చెబుతుంటే చెవులు రిక్కించి వినేవాడు. కాస్త పెద్దయ్యాక ప్రఖ్యాత శాస్త్రవేత్తల జీవిత చరిత్రలు, పరిశోధనల పుస్తకాలను ఆ కుర్రాడికి ఇచ్చేవారు కన్నవాళ్లు. అప్పటికే భౌతికశాస్త్రంపై ఉత్సుకత పెంచుకున్న తేజస్వికి బాబాయ్ గుప్త ఓసారి టెలిస్కోపు, ఆస్ట్రానమీ, ఆస్ట్రోఫిజిక్స్ పుస్తకాలను బహుమానంగా ఇచ్చారు. దీంతో విశ్వంలోని నిగూఢమైన రహస్యాలను ఛేదించే శాస్త్రవేత్త కావాలని ఓ లక్ష్యం ఏర్పరచుకున్నాడు. దానికి తగ్గట్టుగానే చదువుల్లో ఫిజిక్స్‌ని ప్రధాన సబ్జెక్టుగా ఎంచుకున్నాడు.
అనుభవాలు వివరిస్తూ..
ఆశయమే కాదు.. ఆచరణలోనూ ఒక క్రమపద్ధతి పాటించాడు తేజస్వి. ర్యాంకులు సాధించి ఇంటర్ పూర్తి చేసినా.. ఐటీ వైపు వెళ్లకుండా ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుతో ఐఐటీ-కాన్పూర్‌లో చేరాడు. అది పూర్తవగానే అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసాకి సాంకేతిక సహకారం అందించే కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ.. నుంచి పీహెచ్‌డీ పూర్తి చేశాడు. ప్రిన్స్‌టన్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఫర్ అడ్వాన్స్‌డ్ స్టడీ నుంచి ఆస్ట్రో ఫిజిక్స్ అంశంలో పోస్ట్ డాక్టరేట్ ఫెలోషిప్ సాధించాడు. పరిశోధనలు చేయడం.. సిద్ధాంతాలు ఆవిష్కరించడం.. పరిశోధక వ్యాసాలు రాయడమే కాదు.. తన కృషిని పలు వేదికలపై పంచుకోవడం తేజస్వికి అలవాటు. కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, ఇజ్రాయెల్, జపాన్, ఆస్ట్రేలియాలలోని విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థలు, అంతర్జాతీయ సమ్మేళనాల్లో ఇప్పటివరకూ చేసిన పరిశోధనల గురించి వివరించాడు. ఆరేళ్ల నుంచి బెంగళూరులోని ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ థియోరెటికల్ సైన్సెస్‌కి ప్రతి ఏడాది వచ్చి అక్కడి పరిశోధక విద్యార్థులతో విలువైన సమాచారం పంచుకుంటున్నాడు. సృష్టి రహస్యాలు శోధించే పనిలో నిమగ్నమై.. ఎప్పటికైనా ప్రఖ్యాత శాస్త్రవేత్త ఐన్‌స్టీన్ సాపేక్ష సిద్ధాంతంలా చరిత్రలో నిలిచిపోయే గొప్ప ఆవిష్కరణ చేయాలన్నది తేజస్వి లక్ష్యం.
చిన్న వయసులోనే మంచి పరిశోధకుడిగా పేరు తెచ్చుకున్న తను పరిశోధక ల్యాబ్, తరగతి గదులకే పరిమితం కావడం లేదు. వీలున్నప్పుడు బొమ్మలేస్తాడు. కవిత్వం రాస్తాడు. ఫిక్షన్ పుస్తకాలు చదువుతాడు. క్రికెట్ చూడటం, ఆడటమూ అన్నా తనకి ఇష్టమే. ‘నేటి యువత ముందు అవకాశాలెన్నో ఉన్నాయి. అందులో ఆసక్తి, ఇష్టం ఉన్నవాటిని ఎంచుకుంటే సగం విజయం సాధించినట్టే’ అంటూ విజయానికి దారేంటో చూపిస్తున్నాడు.
తాతయ్య ప్రోత్సాహంతో..
ధ్వన్యనుకరణ సమ్రాట్ నేరెళ్ల వేణుమాధవ్‌కి తేజస్వి స్వయానా మనవడు. చిన్నప్పుడు ఆయన ఒడిలో కూర్చొని ఎన్నో సంగతులు ఒంట పట్టించుకున్నాడు. అమెరికాలో ఉంటున్నా.. శాస్త్రవేత్తగా రాణిస్తున్నా.. మన సంప్రదాయం, సంస్కృతిని అభిమానించడానికి కారణం తాతయ్యే. నేరెళ్ల వేణుమాధవ్ మిమిక్రీ కళాకారుడే కాదు.. అద్భుతంగా బొమ్మలు వేసేవారు. తాత నుంచి ఆ కళ అందిపుచ్చుకున్నాడు తేజస్వి. ఐఐటీ-జేఈఈలో ర్యాంకు సాధించిన తర్వాత ఎవరూ అనుకోని విధంగా ఫిజిక్స్ సబ్జెక్టుతో ఐఐటీ-కాన్పూర్‌లో చేరతానన్నాడు తేజస్వి. అప్పుడు తేజస్వి నాన్న కొంచెం గాబరా పడ్డారు. ‘పిల్లలకు తమకిష్టమైనది చదవనిస్తేనే.. వాళ్లు ఎదుగుతారు. ఎవరి అండదండలు లేకుండా ఆ రంగంలో పైకి వస్తారు. అందులో వాళ్లకంటూ ఓ ప్యాషన్ ఉంటుంది. మా నాన్న అభీష్టానికి వ్యతిరేకంగా నేను కళారంగం ఎంచుకొని ఈ స్థాయికి వచ్చాను కదా. చూస్తూ ఉండు.. చిన్నవయసులోనే వాడు ఉన్నతస్థానానికి ఎదుగుతాడు’ అంటూ మనవడిని ప్రోత్సహించారు. ఆ ఫలితమే తక్కువ వయసులో మేటి పరిశోధకుడిగా ఎదిగాడు తేజస్వి.
⇒ పదోతరగతి (సీబీఎస్‌ఈ)లో ఆలిండియా మొదటి ర్యాంకు. నేషనల్ సైన్స్ ఒలింపియాడ్‌లో మొదటిస్థానం.
⇒ ఐఐటీ-జేఈఈలో అఖిలభారత స్థాయిలో ఐదో ర్యాంకు. బిట్‌శాట్‌లో మొదటి స్థానం.
⇒ ప్రతిష్ఠాత్మక ఇంటర్నేషనల్ ఫుల్‌బ్రైట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అవార్డు.
⇒ అకడమిక్ పరంగా అత్యుత్తమ ప్రతిభ చూపడంతో ప్రెసిడెంట్ గోల్డ్‌మెడల్ వరించింది.
⇒ ఐఐటీ-కాన్పూర్‌లో ఉత్తమ అకడమిక్ ప్రతిభతో జనరల్ ఫ్రొఫిషియెన్సీ మెడల్.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Sharad Pawar: శరద్ పవార్‌ను బెదిరిస్తూ.. సుప్రియా సూలేకు వాట్సప్ మెసేజ్
-
Politics News
Ponguleti Srinivasa Reddy: త్వరలోనే పార్టీ చేరిక తేదీలు ప్రకటిస్తా: పొంగులేటి
-
Crime News
Crime News: శంషాబాద్‌లో చంపి.. సరూర్‌నగర్ మ్యాన్‌హోల్‌లో పడేశాడు..
-
Crime News
‘ఆమెది ఆత్మహత్య.. శ్రద్ధా ఘటన స్ఫూర్తితో ముక్కలు చేశా’: ముంబయి హత్య కేసులో ట్విస్ట్
-
Sports News
WTC Final: భారత్ గోల్డెన్ అవర్‌ను చేజార్చుకొంది: పాంటింగ్
-
General News
Viveka Murder case: అవినాష్‌రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్‌పై సుప్రీంలో మంగళవారం విచారణ