logo

ధైర్యానికి మెచ్చారు...

ఏటా కేంద్రప్రభుత్వం, మహిళా శిశుసంక్షేమశాఖ ఆధ్వర్యంలో ధైర్యసాహసాలు ప్రదర్శించే విద్యార్థులకు ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాలను ప్రదానం చేస్తుంది. ఈసారి శ్రీకాకుళం మండలం పొన్నాం గ్రామానికి చెందిన జి.సత్యనారాయణ,

Updated : 23 Jan 2022 05:37 IST

జి.హిమప్రియ

పాతశ్రీకాకుళం, న్యూస్‌టుడే: ఏటా కేంద్రప్రభుత్వం, మహిళా శిశుసంక్షేమశాఖ ఆధ్వర్యంలో ధైర్యసాహసాలు ప్రదర్శించే విద్యార్థులకు ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాలను ప్రదానం చేస్తుంది. ఈసారి శ్రీకాకుళం మండలం పొన్నాం గ్రామానికి చెందిన జి.సత్యనారాయణ, పద్మావతి దంపతుల కుమార్తె హిమప్రియ 12 ఏళ్ల వయసులోనే ఆ గుర్తింపు దక్కించుకుంది. ఈమె తండ్రి ఆర్మీలో పనిచేస్తున్నారు. ఉద్యోగరీత్యా 2018లో జమ్మూలోని ఆర్మీ క్వార్టర్స్‌లో కుటుంబంతో కలిసి ఉండేవారు. ఆ సంవత్సరం ఫిబ్రవరి 10న ఉదయం 5 గంటల సమయంలో తీవ్రవాదులు వారి క్వార్టర్స్‌పై భారీ మారణాయుధాలతో దాడి చేశారు. ఆ సమయంలో ఇంటిలో హిమప్రియ తల్లితో ఉంది. గాయాలపాలైనప్పటికీ విద్యార్థిని ధైర్య సాహసాలు ప్రదర్శించి తీవ్రవాదులను ఎదుర్కొంటూ,  తల్లితో పాటు క్వార్టర్స్‌లోని కొంతమందిని కాపాడే ప్రయత్నం చేసింది. ఈ నెల 24న జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్రమోదీ వర్చువల్‌ విధానంలో ప్రశంసాపత్రంతో పాటు రూ.లక్ష బహుమతి అందజేయనున్నారని కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లఠ్కర్‌ శనివారం తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని