Ap News: ప్రజలను మెప్పించలేక ప్రతిపక్షం గొంతు నొక్కే ప్రయత్నాలు: నారా లోకేశ్‌

జగన్‌ సీఎం అయ్యాక రాష్ట్ర ప్రజలు, ప్రతిపక్షాలకు రక్షణ లేకుండా పోయిందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి

Published : 13 Jan 2022 09:32 IST

అమరావతి‌: జగన్‌ సీఎం అయ్యాక రాష్ట్ర ప్రజలు, ప్రతిపక్షాలకు రక్షణ లేకుండా పోయిందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విమర్శించారు. గుంటూరు జిల్లా వెల్దు్ర్తి మండలం గుండ్లపాడులో ఇవాళ ఉదయం మాచర్ల తెదేపా ఇన్‌ఛార్జ్‌ జూలకంటి బ్రహ్మారెడ్డి అనుచరుడు చంద్రయ్య దారుణ హత్యపై లోకేశ్‌ స్పందించారు. ప్రశ్నించే వారిపై దాడులు, పోరాడేవారిని అంతమొందించడం పరిపాటిగా మారిందన్నారు. పాలనలో ప్రజలను మెప్పించలేకనే ప్రతిపక్షం గొంతు నొక్కే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రయ్య హత్యను తాను తీవ్రంగా ఖండిస్తున్నానని.. హత్యకు పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేసి శిక్షించాలని లోకేశ్‌ డిమాండ్ చేశారు. చంద్రయ్య కుటుంబానికి తెదేపా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని