Sajjala: మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యలను రాజకీయం చేయదల్చుకోలేదు: సజ్జల

ఆంధ్రప్రదేశ్‌పై తెలంగాణ మంత్రి కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలను ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఖండించారు. ‘‘కేటీఆర్‌ అయినా, ఎవరైనా ముందు వాళ్ల రాష్ట్రం

Published : 29 Apr 2022 17:53 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌పై తెలంగాణ మంత్రి కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలను ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఖండించారు. ‘‘కేటీఆర్‌ అయినా, ఎవరైనా ముందు వాళ్ల రాష్ట్రం గురించి మాట్లాడాలి.. ఆ తర్వాతే ఇతరుల గురించి మాట్లాడాలి. రాష్ట్ర విభజన తర్వాత ఆస్తుల పంపకాలు ఇంకా పూర్తిగా జరగలేదు. సుమారు రూ.50-60వేల కోట్ల ఆస్తుల విభజన జరగాల్సి ఉంది. ఏపీకి కేపిటల్‌ లేకుండానే విభజన చేశారు. విభజన తర్వాత ఐదేళ్లపాటు అభివృద్ధి జరగలేదు. ఉమ్మడి రాష్ట్రంలోనే హైదరాబాద్‌ అభివృద్ధి చెందింది. హైదరాబాద్‌లో పీవీ ఎక్స్‌ప్రెస్‌వే వైఎస్‌ హయాంలో చేపట్టారు. రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందో వాళ్లకూ మనకూ అందరికీ తెలుసు. అధిక వర్షాల వల్లే రోడ్లు దెబ్బతిన్నాయి. కేటీఆర్‌ వ్యాఖ్యలను రాజకీయం చేయదల్చుకోలేదు. తెలంగాణలోనూ రోడ్లు బాగాలేవు. మొన్నటి వరకు తెలంగాణలో విద్యుత్‌ కోతలు ఉన్నాయి. రాష్ట్ర ప్రజలకు అన్ని విషయాలు తెలుసు. సీఎం జగన్‌ పాలనలో తన మార్కును చూపిస్తున్నారు’’ అని సజ్జల వివరించారు.

ఎన్నికల హామీలు ఎంత వరకు నెరవేర్చారో చెప్పాలి: ఏపీ మంత్రి సురేష్‌

తెలంగాణ మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యలపై ఏపీ పురపాలకశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ స్పందించారు. ‘‘400 సంవత్సరాల క్రితం ఏర్పడిన హైదరాబాద్‌ను చూసి అభివృద్ధి అనుకుంటున్నారేమో. ఇప్పటికి కూడా వారి హయాంలో డ్రైనేజీ వ్యవస్థను చక్కదిద్దుకోలేకపోయారు. వర్షాలు వస్తే హైదరాబాద్‌లో మురుగునీరు ఎలా పొంగి ప్రవహిస్తుందో అందరికీ తెలుసు. అదేనా అక్కడి ప్రభుత్వం చేసిన అభివృద్ధి. ఎన్నికల హామీలు, డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల నిర్మాణం ఎంత వరకు నెరవేర్చారో చెప్పాలి’’ అని మంత్రి సురేష్‌ ప్రశ్నించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని