కొత్త హెచ్‌ఆర్‌ఏ పోలీసులు, న్యాయ సిబ్బందికి వర్తించదు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 2018 పీఆర్సీలో నిర్ణయించిన కొత్త అద్దె భత్యం పోలీసుశాఖలోని ఇన్‌స్పెక్టర్‌, అంతకంటే దిగువ క్యాడర్‌లో ఉన్న ఉద్యోగులకు వర్తించబోదని రాష్ట్ర ఆర్థికశాఖ తన ఉత్తర్వుల్లో

Published : 19 Jan 2022 04:50 IST

త్వరలో ప్రత్యేక ఉత్తర్వులు

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 2018 పీఆర్సీలో నిర్ణయించిన కొత్త అద్దె భత్యం పోలీసుశాఖలోని ఇన్‌స్పెక్టర్‌, అంతకంటే దిగువ క్యాడర్‌లో ఉన్న ఉద్యోగులకు వర్తించబోదని రాష్ట్ర ఆర్థికశాఖ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌ హయ్యర్‌ జ్యుడిషియల్‌ సర్వీసు, రాష్ట్ర జ్యుడిషియల్‌ సర్వీసు ఉద్యోగులకూ ఇవి వర్తించబోవని స్పష్టం చేసింది. పోలీసుల విషయంలో హోంశాఖ ప్రత్యేక ఉత్తర్వులు ఇవ్వనుందని పేర్కొంది. న్యాయశాఖ సిబ్బంది విషయంలోనూ ప్రత్యేక ఉత్తర్వులు వెలువరిస్తామని తెలిపింది. కొత్త ఇంటి అద్దెభత్యం 24%, 16%, 8%గా ప్రభుత్వం నిర్ణయించింది. దిల్లీలోని ఏపీ భవన్‌, ఇతర ప్రభుత్వ కార్యాలయాలు, హైదరాబాద్‌లోని ఏపీ కార్యాలయాల్లో 24%గా నిర్ణయించింది. విశాఖ, నెల్లూరు, గుంటూరు, విజయవాడ, సచివాలయ సిబ్బందికి 16%గా, మిగిలిన రాష్ట్రంలోని అందరు ఉద్యోగులకు 8%గా నిర్ణయించింది. 2011 జనాభా లెక్కల ప్రకారమే వీటిని నిర్ణయించినట్లు ఉత్తర్వుల్లో ప్రస్తావించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని