సాగర్‌ ఆయకట్టుకు జులై 15 నుంచి సాగునీరు

నాగార్జునసాగర్‌ ఆయకట్టుకు జులై 15న సాగునీటిని విడుదల చేయనున్నారు. రాష్ట్రంలో ప్రధాన ప్రాజెక్టుల కింద ఆయకట్టులవారీగా నీటి విడుదల తేదీలపై వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య గురువారం ఉత్తర్వులిచ్చారు.

Updated : 20 May 2022 06:15 IST

ఈనాడు, అమరావతి: నాగార్జునసాగర్‌ ఆయకట్టుకు జులై 15న సాగునీటిని విడుదల చేయనున్నారు. రాష్ట్రంలో ప్రధాన ప్రాజెక్టుల కింద ఆయకట్టులవారీగా నీటి విడుదల తేదీలపై వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య గురువారం ఉత్తర్వులిచ్చారు.
జూన్‌ 1న: గోదావరి డెల్టా
జూన్‌ 10న: కృష్ణా డెల్టా, గుంటూరు ఛానెల్‌, గండికోట, బ్రహ్మసాగర్‌, చిత్రావతి, వెలిగల్లు, పెన్నా పరివాహక జలాశయాలు
జూన్‌ 30న: గోరకల్లు (ఎస్‌ఆర్‌బీసీ), అవుకు (ఎస్‌ఆర్‌బీసీ)
జులై 15న: నాగార్జునసాగర్‌ ఆయకట్టు
జూన్‌ 14న పంటల బీమా పరిహారం

వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా పథకం కింద 2021 ఖరీఫ్‌ పరిహారాన్ని జూన్‌ 14న విడుదల చేయనున్నట్లు వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 3వేల ట్రాక్టర్లు, 402 వరికోత యంత్రాలను జూన్‌ 6న పంపిణీ చేస్తారు. జూన్‌ 21న అమ్మఒడి నిధులు జమ చేస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని