MLC Ananthababu: అనంతబాబు సస్పెన్షన్‌

మాజీ డ్రైవర్‌, దళిత యువకుడు సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎమ్మెల్సీ అనంత బాబును వైకాపా ఎట్టకేలకు పార్టీ

Updated : 26 May 2022 07:24 IST

డ్రైవర్‌ హత్య వెలుగు చూసిన  6 రోజుల తర్వాత స్పందించిన వైకాపా

ఈనాడు-అమరావతి, న్యూస్‌టుడే-రాజమహేంద్రవరం నేరవార్తలు: మాజీ డ్రైవర్‌, దళిత యువకుడు సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎమ్మెల్సీ అనంత బాబును వైకాపా ఎట్టకేలకు పార్టీ నుంచి సస్పెండు చేసింది. ఈ నెల 19న రాత్రి ఈ హత్య జరగ్గా.. 6 రోజుల తర్వాత పార్టీ స్పందించడం గమనార్హం. ‘తన మాజీ డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం మరణానికి తానే బాధ్యుడినని ఎమ్మెల్సీ అనంత బాబు వాంగ్మూలం ఇచ్చినట్లు పోలీసులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో వైకాపా అధ్యక్షుడు జగన్‌ ఆదేశాల మేరకు అనంతబాబును పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తున్నాం’ అని వైకాపా కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. అందులో ఎక్కడా ‘హత్య’ అనే పదాన్ని వాడలేదు. మరోవైపు హత్య కేసులో ప్రధాన నిందితుడిగా రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో రిమాండ్‌లో ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబును రంపచోడవరం ఎమ్మెల్యే ధనలక్ష్మి కలిశారు. సుమారు అర్ధగంటపాటు ఎమ్మెల్సీతో మాట్లాడారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని