‘మంత్రీ’మార్బలంతో శ్రీవారి దర్శనానికి!

మంత్రి ఉష శ్రీచరణ్‌ 60 మంది అనుచరులతో కలిసి సోమవారం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. వీరిలో పది మందికి సుప్రభాతం, 50 మందికి బ్రేక్‌ దర్శనం టిక్కెట్లను తితిదే కేటాయించింది. తిరుమలలో

Updated : 16 Aug 2022 06:39 IST

60 మందితో వచ్చిన మంత్రి ఉష శ్రీచరణ్‌

తిరుమల, న్యూస్‌టుడే: మంత్రి ఉష శ్రీచరణ్‌ 60 మంది అనుచరులతో కలిసి సోమవారం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. వీరిలో పది మందికి సుప్రభాతం, 50 మందికి బ్రేక్‌ దర్శనం టిక్కెట్లను తితిదే కేటాయించింది. తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా ఉందని, భక్తులు ప్రణాళిక ప్రకారం రావాలని, పది రోజుల పాటు దర్శనాలు వాయిదా వేసుకోవాలంటూ నాలుగు రోజుల క్రితమే తితిదే ప్రకటించింది. ప్రస్తుతం సర్వదర్శనానికి 40 గంటలకు పైగా సమయం పడుతోంది. క్యూలైన్లలో చిన్నారులు, వృద్ధులు, మహిళలు తీవ్ర ఇబ్బంది పడుతూ గంటల తరబడి నిరీక్షిస్తున్నారు. ఈ తరుణంలో మంత్రి ఉష శ్రీచరణ్‌ భారీగా మందీమార్బలంతో వచ్చి వీఐపీ ప్రొటోకాల్స్‌తో దర్శనం చేసుకోవడంపై సాటి భక్తుల నుంచి విమర్శలు వ్యక్తమయ్యాయి. ఇదే విషయమై మీడియా ఆలయం ఎదుట మంత్రిని ప్రశ్నించగా స్పందించకపోగా, వారిని తోసుకుంటూ ఆమె ముందుకు వెళ్లిపోయారు. దీనిపై తితిదే నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని