విలీనంతో గ్రామాలకు విద్య దూరం

విద్యను చేరువ చేయాలన్న లక్ష్యంతో నాడు దివంగత ఎన్టీరామారావు ప్రతి గ్రామంలో ఒక పాఠశాల ఏర్పాటు చేస్తే.. నేడు విలీనం పేరుతో తరగతులను తరలిస్తూ పల్లెలకు విద్యను దూరం చేస్తున్నారని హిందూపురం

Updated : 19 Aug 2022 05:00 IST

సినిమాల్లో నటిస్తూనే ఉంటా: బాలకృష్ణ

హిందూపురం అర్బన్‌, న్యూస్‌టుడే: విద్యను చేరువ చేయాలన్న లక్ష్యంతో నాడు దివంగత ఎన్టీరామారావు ప్రతి గ్రామంలో ఒక పాఠశాల ఏర్పాటు చేస్తే.. నేడు విలీనం పేరుతో తరగతులను తరలిస్తూ పల్లెలకు విద్యను దూరం చేస్తున్నారని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పురపాలక సంఘం పరిధిలోని కొట్నూరు జడ్పీ ఉన్నత పాఠశాల కళా వేదిక వద్ద గురువారం జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే బాలకృష్ణ తన సొంత నిధులు రూ.4లక్షలతో నియోజకవర్గంలోని 30 పాఠశాలలకు ఎల్‌ఈడీ టీవీలు వితరణ చేశారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వం కొత్తగా రహదారులు వేయడం లేదు.. కనీసం గుంతలు పూడ్చటం లేదన్నారు. విద్యార్థులు సోషల్‌ మీడియా, యూట్యూబ్‌లకు దూరంగా ఉంటూ.. అవసరం మేరకే వాటిని వినియోగించుకోవాలన్నారు. సినిమాల్లో నటించే కళ భగవంతుడు ఇచ్చిన వరమని, సినిమాల్లో తాను నటిస్తూనే ఉంటానని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని