రేవుల్లో ఇష్టారీతిన ఇసుక తవ్వొద్దు

నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వకం, అక్రమ రవాణాపై పులివెందుల, కమలాపురం నియోజకవర్గాలకు చెందిన అధికార పార్టీ నేతలు కన్నెర్ర చేశారు.

Updated : 05 Oct 2022 05:03 IST

రవాణాను అడ్డుకున్న వైకాపా నేతలు

ఈనాడు డిజిటల్‌, కడప, న్యూస్‌టుడే-పెండ్లిమర్రి: నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వకం, అక్రమ రవాణాపై పులివెందుల, కమలాపురం నియోజకవర్గాలకు చెందిన అధికార పార్టీ నేతలు కన్నెర్ర చేశారు. కమలాపురం నియోజకవర్గం పెండ్లిమర్రి మండలం కొత్త గంగిరెడ్డిపల్లె రేవులో ఇసుక ఇష్టారాజ్యంగా తోడుతుండటంతో మంగళవారం ఆయా వాహనాలను అడ్డుకుని రవాణా నిలిపివేశారు. యంత్రాలు ఉపయోగించి అత్యంత లోతులో, హద్దులు లేకుండా ఎక్కడపడితే అక్కడ తవ్వుకుపోతున్నారని వారు ఆక్షేపించారు. కొత్తగా నందిమండలం నుంచి తువ్వపల్లె మీదుగా అల్‌రెడ్డిపల్లె మార్గంలో టిప్పర్ల రాకపోకలతో రహదారి ధ్వంసమవుతోందని వాపోయారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని వైకాపా ఎంపీటీసీ సభ్యుడు ప్రదీప్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా రేవు నిర్వాహకులు, నేతల మధ్య వివాదం చోటు చేసుకుంది. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరువర్గాలకు సర్దిచెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని