Aurobindo pharma: శరత్‌ చంద్రారెడ్డి అరెస్ట్‌.. కుప్పకూలిన అరబిందో ఫార్మా షేరు

కొంతకాలంగా అరబిందో ఫార్మా షేరు స్టాక్‌ మార్కెట్లో మదుపరులను పెద్దగా ఆకర్షించడం లేదు. గరిష్ఠ ధర అయిన రూ.900 నుంచి గత ఏడాదిన్నర కాలంలో ఈ షేరు విలువ బాగా పతనమైంది.

Updated : 11 Nov 2022 07:52 IST

ఈనాడు, హైదరాబాద్‌: దిల్లీ మద్యం కుంభకోణం కేసులో పి.శరత్‌ చంద్రారెడ్డిని ఈడీ అధికారులు అరెస్టు చేయడం స్థానిక కార్పొరేట్‌ వర్గాల్లో, స్టాక్‌మార్కెట్‌ ఇన్వెస్టర్లలో చర్చనీయాంశంగా మారింది. ఈ అరెస్టు ప్రభావం అరబిందో ఫార్మా షేరు ధరపై కనిపించింది. కొంతకాలంగా అరబిందో ఫార్మా షేరు స్టాక్‌ మార్కెట్లో మదుపరులను పెద్దగా ఆకర్షించడం లేదు. గరిష్ఠ ధర అయిన రూ.900 నుంచి గత ఏడాదిన్నర కాలంలో ఈ షేరు విలువ బాగా పతనమైంది. గత మూడు నెలలుగా రూ.550- 575 శ్రేణిలో ట్రేడ్‌ అవుతోంది. శరత్‌ చంద్రారెడ్డి అరెస్టు కాగానే, గురువారం అరబిందో ఫార్మా షేరు ఒక్కసారిగా తీవ్రమైన అమ్మకాల ఒత్తిడికి లోనైంది. బీఎస్‌ఈలో బుధవారం ముగింపు ధర రూ.541 కాగా, గురువారం 11.69 శాతం (రూ.63.30) నష్టపోయి రూ.478.10 వద్ద స్థిరపడింది. బుధవారంతో పోల్చితే దాదాపు రూ.3,700 కోట్ల మార్కెట్‌ విలువను ఈ కంపెనీ కోల్పోయింది.

అరబిందో ఫార్మాకు సంబంధం లేదు: ఈ నేపథ్యంలో అరబిందో ఫార్మా వివరణ ఇచ్చింది. శరత్‌ చంద్రారెడ్డికి అరబిందో ఫార్మా కార్యకలాపాలతో కానీ, దాని అనుబంధ కంపెనీల కార్యకలాపాలతో కానీ సంబంధం లేదని సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది. ఆయన కంపెనీ బోర్డులో హోల్‌టైమ్‌ డైరెక్టర్‌గా ఉన్నారని వివరించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని