ఆ ఆరుగురినీ విచారించండి

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ.. కేవలం ఒక కోణంలోనే విచారణ జరుపుతూ తప్పుదోవ పట్టిస్తోందని, ఈ కేసులో అయిదో నిందితుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి భార్య తులసమ్మ పులివెందుల కోర్టుకు విన్నవించారు.

Published : 27 Nov 2022 04:48 IST

వివేకా హత్య కేసులో నిందితుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి భార్య తులసమ్మ విన్నపం

ఈనాడు డిజిటల్‌, కడప, న్యూస్‌టుడే, పులివెందుల: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ.. కేవలం ఒక కోణంలోనే విచారణ జరుపుతూ తప్పుదోవ పట్టిస్తోందని, ఈ కేసులో అయిదో నిందితుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి భార్య తులసమ్మ పులివెందుల కోర్టుకు విన్నవించారు. హత్య కుట్రలో వివేకా అల్లుడు రాజశేఖర్‌రెడ్డితోపాటు ఆరుగురి ప్రమేయంపై సీబీఐ విచారణ జరిపే విధంగా ఆదేశాలివ్వాలని గతంలో ఆమె పిటిషన్‌ వేశారు. ఈ పిటిషన్‌పై 9 నెలల అనంతరం శనివారం విచారణ చేపట్టిన కోర్టు.. ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేసింది. తదుపరి విచారణను వచ్చే నెల 24వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసుతో తన భర్త దేవిరెడ్డికి ఎలాంటి సంబంధం లేదని తులసమ్మ పేర్కొన్నారు. పిటిషన్‌లో పేర్కొన్న వివరాలను కడపలో శనివారం ఆమె తరపు న్యాయవాది రవీందర్‌రెడ్డి మీడియాకు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని