తలచుకుంటే సంక్షేమ పథకాలు అందకుండా చేస్తా: వైకాపా ఎమ్మెల్యే

కొందరు ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొంది కూడా వైకాపా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి మండిపడ్డారు.

Updated : 05 Dec 2022 08:27 IST

విడవలూరు, న్యూస్‌టుడే: కొందరు ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొంది కూడా వైకాపా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి మండిపడ్డారు. తాను తలచుకుంటే వారి సంక్షేమ పథకాలు ఆపేయగలనని.. కానీ, అలా చేయబోనని అన్నారు. విడవలూరు మండలం దండిగుంట, వరిణి గ్రామాల్లో గడపగడపకు కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. రామతీర్థంలో రెండు రోజుల క్రితం తెదేపా వారు నిర్వహించిన ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమంలో పాల్గొని ఓ మహిళ ప్రభుత్వంపై విమర్శలు చేయడంపై ఆగ్రహించారు. ఆమె కుటుంబసభ్యులు అనేక ప్రభుత్వ సంక్షేమ పథకాలను పొంది సీఎంను విమర్శిస్తున్నారంటూ మండిపడ్డారు. ఆమె భర్త పంచాయతీలో పంపు ఆపరేటర్‌గా విధులు నిర్వహిస్తున్నారని, ఆయన్ను వెంటనే విధుల్లోనుంచి తొలగించాలని అధికారులను ఆదేశించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని