అదనపు దూరానికి రైతులు డబ్బు కట్టాల్సిందే

వైఎస్సార్‌ జలకళ పథకం కింద వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లను ప్రభుత్వం ఉచితంగా ఇస్తుందని.. అయితే, 180 మీటర్ల వరకు (మూడు విద్యుత్‌ స్తంభాలు, తీగలు, ఇతర సామాగ్రి) అయ్యే ఖర్చును మాత్రమే భరిస్తామని ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు పేర్కొన్నారు.

Published : 20 Mar 2023 03:49 IST

‘వైఎస్సార్‌ జలకళ’పై ఉప ముఖ్యమంత్రి ముత్యాలనాయుడు

ఈనాడు, అమరావతి: వైఎస్సార్‌ జలకళ పథకం కింద వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లను ప్రభుత్వం ఉచితంగా ఇస్తుందని.. అయితే, 180 మీటర్ల వరకు (మూడు విద్యుత్‌ స్తంభాలు, తీగలు, ఇతర సామాగ్రి) అయ్యే ఖర్చును మాత్రమే భరిస్తామని ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు పేర్కొన్నారు. వైఎస్సార్‌ జలకళ పథకం అమలు తీరుపై ఆదివారం మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ.. ‘‘సన్న, చిన్నకారు రైతులకు బోరు ఉచితంగా తవ్విస్తాం. మోటారు, విద్యుత్‌ కనెక్షన్‌ కూడా ఉచితంగా ఇస్తాం. రైతు పొలానికి కనెక్షన్‌ ఇవ్వడానికి 180 మీటర్ల దూరం వరకు మాత్రమే మెటీరియల్‌ను డిస్కంలు భరిస్తాయి. మూడు నాలుగు కిలో మీటర్ల దూరంలో రైతు పొలం ఉంటే.. అక్కడి వరకు విద్యుత్‌ లైన్లు వేసి కనెక్షన్లు ఇవ్వమంటే ఎలా? నిబంధనకు మించి ఉన్న దూరానికి లైన్లు వేయడానికి ఏర్పాటు చేసే స్తంభాలు, తీగలకు అయ్యే ఖర్చును రైతులే భరించాలి’’ అని ఉపముఖ్యమంత్రి పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని