ఎకరా స్థలంలో 35 రకాల వరి వంగడాలు

పూర్వకాలం నాటి వివిధ రకాల ధాన్యాలను జనబాహుళ్యంలోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నారు ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకల గ్రామానికి చెందిన రైతు షేక్‌వలీ సుభానీ.

Published : 23 Mar 2023 04:02 IST

పూర్వకాలం నాటి వివిధ రకాల ధాన్యాలను జనబాహుళ్యంలోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నారు ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకల గ్రామానికి చెందిన రైతు షేక్‌వలీ సుభానీ. పదో తరగతి చదివినప్పటికీ ప్రకృతి సేద్యం అంటే ఇష్టం. ఔషధ గుణాలు, పోషక విలువలు కలిగి.. మధుమేహాన్ని నివారించే 35 రకాల దేశీయ వరి వంగడాలను సేకరించారు. ఎకరా విస్తీర్ణంలో ఒక్కో వరి రకం మూడు నాలుగు సెంట్ల స్థలంలో వేశారు. ఎక్కడ వ్యవసాయ ప్రదర్శనలు జరిగినా వెళ్లి అరుదైన వరి కంకులను సేకరించడం అలవాటు. కర్ణాటక, కేరళ, గుజరాత్‌, మహారాష్ట్ర, ఈశాన్య రాష్ట్రాల్లో అరుదుగా లభించే దేశవాళీ రకాలైన కాలబట్టి, కాలజీర, బర్మాబ్లాక్‌, కర్పూరకవని, అస్సామినీల, నవారా, మాపిళైసాంబ, పుంగార్‌, రక్తశాలి వంటి రకాలను తన పొలంలో సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తున్నారు.

ఈనాడు, ఒంగోలు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు