ఒంటిమిట్ట రామాలయంలో వేడుకగా ధ్వజారోహణం

వైయస్‌ఆర్‌ జిల్లా ఒంటిమిట్టలోని కోదండరామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా తొలిరోజు శుక్రవారం ధ్వజారోహణం నిర్వహించారు.

Updated : 01 Apr 2023 06:00 IST

వైయస్‌ఆర్‌ జిల్లా ఒంటిమిట్టలోని కోదండరామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా తొలిరోజు శుక్రవారం ధ్వజారోహణం నిర్వహించారు. తితిదే పాంచరాత్ర ఆగమశాస్త్ర సలహాదారు కల్యాణపురం రాజేష్‌ భట్టార్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం 9 గంటల తర్వాత గరుడ పటాన్ని ప్రతిష్ఠించారు. నవకలశ పంచామృతాభిషేకం చేసి సకల దేవతలను, అష్టదిక్పాలకులను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించారు. రాత్రి శేష వాహనంపై కోదండరాముడిని ఊరేగించారు. ఒంటిమిట్ట వీధుల్లో గ్రామోత్సవం కనులపండువగా నిర్వహించారు. తితిదే జేఈవో వీరబ్రహ్మం, రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి, జేసీ సాయికాంత్‌వర్మ హాజరయ్యారు. ఏప్రిల్‌ 5న నిర్వహించే సీతారాముల కల్యాణోత్సవ ఏర్పాట్లను జేఈవో, జేసీ పరిశీలించారు.

న్యూస్‌టుడే, ఒంటిమిట్ట

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని